Sankranthi Brahmotsavalu : జనవరి 12 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

కర్నూలు జిల్లాలోని  ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈనెల 12 నుంచి సంక్రాంతి  బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి.

Sankranthi Brahmotsavalu : జనవరి 12 నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Sankranthi Brahmotsavalu

Sankranthi Brahmotsavalu :  కర్నూలు జిల్లాలోని  ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈనెల 12 నుంచి సంక్రాంతి  బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. వారం రోజులపాటు ఈబ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి  సాంప్రదాయం ప్రకారం ప్రతిఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మకర సంక్రాంతిరోజున, మహాశివరాత్రి సందర్భంగా జరుపుతుంటారు.

ఈనెల 12న ఉదయం గం.9.15 ని.లకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలుప్రారంభమవుతాయి. 13న బృంగి వాహన సేవ, 14న రావణ వాహాన సేవ, 15న నందివాహాన సేవ, బ్రహ్మోత్సవ కళ్యాణం, 16న కైలాస వాహనసేవ, పుష్ప పల్లకి సేవ, 17న పూర్ణాహుతి, త్రిశూల స్నానం, సదస్యం నాగావళి, ధ్వజావరోహణంతో కార్యక్రమాలు ముగుస్తాయి.
Also Read : Khammam Constable Suicide : ఖమ్మంలో విషాదం.. కొన్ని గంటల్లో నిశ్చితార్ధం.. కానిస్టేబుల్ ఆత్మహత్య !
ముగింపు రోజున  జనవరి 18న అశ్వవాహాన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహిస్తారు. ఈనెల 14న ఉదయం ఆలయ ప్రాంగణంలో అక్కమహాదేవి అలంకార మండపంలో సామూహిక భోగి పండ్ల కార్యక్రమం నిర్వహిస్తారు.