Seal Forward : కల్లోల కడలి.. భయం గుప్పిట్లో తీరప్రాంత వాసులు..

కడలి కల్లోలం.. తీరప్రాంతవాసులను వణికిస్తోంది. కొన్నిచోట్ల ముందుకు వచ్చిన సముద్రం.. మరికొన్ని చోట్ల వెనక్కి వెళ్లింది.

Seal Forward : కల్లోల కడలి.. భయం గుప్పిట్లో తీరప్రాంత వాసులు..

Sea Came Forward In In East Godavari District

Updated On : August 25, 2021 / 9:45 PM IST

sea came forward in in east godavari district : కడలి కల్లోలం.. తీరప్రాంతవాసులను వణికిస్తోంది. కొన్నిచోట్ల ముందుకు వచ్చిన సముద్రం.. మరికొన్ని చోట్ల వెనక్కి వెళ్లింది. కాసేపటి క్రితం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో సముద్రం వెనక్కి వెళ్లింది. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థంకాక స్థానికులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. అంతర్వేది దగ్గర ఉదయం ముందుకు వచ్చిన సముద్రం.. సాయంత్రం 30 మీటర్లు వెనక్కి వెళ్లింది. ఉప్పాడ, మొగల్తూరులో ఉదయం నుంచే వెనక్కి వెళ్లింది.

ఉప్పాడలో ఇప్పటి వరకు 45మీటర్లు వెనక్కి వెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో సముద్రంలో అసలు ఏం జరుగుతుంది, ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తుందా అన్న భయాందోళనలు నెలకొంది. అంతుచిక్కని ఈ మిస్టరీ ఇప్పుడు శాస్త్రవేత్తలను కూడా కలవరపెడుతోంది.

నిన్న బంగాళాఖాతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. నెల్లూరుకి మూడు వందల కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం కారణంగా చెన్నై తీరప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టు తెలిపారు అధికారులు.