Software Engineer Radha Case: క్రూరంగా హింసించి ప్రాణాలు తీశారు.. రాధ పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు..

సీసీ ఫుటేజ్‌ ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆమె పట్టణంలోని పామూరు బస్టాండు షెల్టర్‌ వద్ద రోడ్డు వెంట చేతిలో కవర్‌తో నడుస్తుండగా, ఎరుపు రంగు కారు అనుసరిస్తున్నట్లు సీసీ పుటేజీల్లో పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె ఆనవాళ్లు లభ్యంకాలేదు.

Software Engineer Radha Case: క్రూరంగా హింసించి ప్రాణాలు తీశారు.. రాధ పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు..

Software Engineer Rada Case

Software Engineer Radha Case: వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు వద్ద హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ మహిళ రాధ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. స్నేహితుడు హత్య చేశాడా..? మరెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు స్వయంగా ఎస్పీ మలిక్‌గర్గ్ పర్యవేక్షణ చేస్తున్నారు. కాగా, పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రాధ వద్ద రూ. 80లక్షలు అప్పు తీసుకున్న ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కాశిరెడ్డి.. ఇప్పటికే నాలుగు కోట్లకు ఐపీ ధాఖాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Prakasam: అప్పు తీరుస్తామని పిలిచి హతమార్చారు.. జిల్లేళ్లపాడు ఘటనలో నిందితుడు ఆచూకీకోసం పోలీసుల విస్తృత గాలింపు

భార్యాభర్తల మధ్య గొడవలు..

ఇబ్బందుల్లో ఉన్న స్నేహితుడిని నమ్మి అతని బాగుకోసం దాచిన కష్టార్జితమంతా కాశిరెడ్డికి అప్పుగా ఇవ్వడంతో నిత్యం రాధ, ఆమె భర్త కోటమహేష్ రెడ్డిల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. అప్పు చెల్లించాలంటూ గండ్లోపల్లికి చెందిన కాశిరెడ్డి, అతని తల్లిదండ్రులపై రాధ తల్లిదండ్రులు, సోదరుడు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అప్పు వసూలు చేసుకొస్తానని భర్తకు చెప్పి హైదరాబాద్ నుండి తన స్వగ్రామంలో జరుగుతున్న చౌడేశ్వరమ్మ కొలుపుల ఉత్సవానికి రాధ వచ్చింది. డబ్బుకోసం కాశిరెడ్డిపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలోనే డబ్బులు ఇస్తానని, నేను చెప్పిన ప్రదేశానికి రావాలని కాశిరెడ్డి చెప్పడంతో డబ్బులకోసం రాధ వెళ్లింది. తరువాత విగతజీవితంగా మారింది.

Adulterated Ginger Garlic Paste : ఈ అల్లం వెల్లులి పేస్ట్ తింటే ప్రాణాలకే ప్రమాదం..! పోలీసుల దాడుల్లో బయటపడిన దారుణం

సీసీ ఫుటేజ్‌లను పరిశీలించగా..

హత్యకు ముందు కనిగిరిలోని ఓ రెడీమేడ్‌ షాపులో బుధవారం రాత్రి 6.30 గంటల సమయంలో రాధ తన పిల్లలకు దుస్తులను కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజ్‌ ఆధారాలను పోలీసులు సేకరించారు. తిరిగి ఆమె పట్టణంలోని పామూరు బస్టాండు షెల్టర్‌ వద్ద రోడ్డు వెంట చేతిలో కవర్‌తో నడుస్తుండగా, ఎరుపు రంగు కారు అనుసరిస్తున్నట్లు సీసీ పుటేజీల్లో పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె ఆనవాళ్లు లభ్యంకాలేదు. అక్కడి నుంచి రాధ ఏమైందన్న దానిపై పోలీసులు కూపీలాగుతున్నారు. అయితే, అప్పుతీసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కాశిరెడ్డికి పోలీసులు కాల్‌ చేయగా, తనకు చంపాల్సిన అవసరం లేదని సమాధానం చెప్పి సెల్‌ఫోన్‌ స్విచ్‌‌ఆఫ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

PM Modi Japan Visit: జపాన్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. బోధి వృక్షాన్ని అక్కడ నాటడంపై కీలక వ్యాఖ్యలు

నాలుగు కోట్లుమేర అప్పు ..

మృతురాలు రాధ, నిందితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి చిన్ననాటి స్నేహితులు కావడంతో ఏడేళ్లుగా హైదరాబాద్‌, బెంగళూరు, తమిళనాడు ప్రాంతాల్లో పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో కలిసి ఉద్యోగం చేశారు. నాలుగేళ్ల క్రితం సొంతంగా కంపెనీ పెడుతున్నానని రాధ దంపతుల వద్ద రూ.80లక్షలు, ఇంకొంతమంది వద్ద 3.20కోట్లను కాశిరెడ్డి అప్పుగా తీసుకున్నాడు. కంపెనీ పెట్టాక వడ్డీతోసహా తిరిగి చెల్లిస్తానని నమ్మించాడు. తీసుకున్న రూ.4కోట్లు జూదం, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, షేర్‌ మార్కెట్‌లలో పెట్టి అంతా పోగొట్టుకున్నాడు. అనంతరం ఐపీ పెట్టి తప్పించుకొని తిరుగుతున్నాడు.

Karnataka CM Swearing: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తి.. ఎవరెవరు హాజరువుతున్నారంటే?

శరీరంపై సిగరేట్లతో కాల్చిన ఆనవాళ్లు ..

రాధను గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. రాధపై ముకుమ్మడిగా అత్యాచారంచేసి సిగరేట్లతో శరీరంపై కాల్చిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆమెను చిత్రహింసలు పెట్టిన అనంతరం రోడ్డుప్రమాదంగా చిత్రీకరించేందుకు దుండగులు ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కనిగీరి డీఎస్పీ రామరాజు ఆధ్వర్యంలో కనిగిరి సీఐ, పామూరు సీఐ, ఒంగోలు క్రైం విభాగం ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రా, స్థానిక పరిసర ప్రాంతాల్లో నిందితుల కోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు.

Bandla Ganesh : ఎన్టీఆర్‌ కూడా నా దేవరనే.. దేవర టైటిల్ వివాదం.. బండ్లగణేష్ ని ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..

కారుకు నెంబర్ ప్లేట్ మార్చిన నిందితులు..

హత్యకు ఉపయోగించిన కారు నంబరును గుర్తించిన పోలీసులు..  ఆ నంబరు ఆధారంగా  విచారణ చేశారు. ఆ కారు హైదరాబాద్‌‌కు చెందిన ఓ వ్యక్తిదిగా గుర్తించారు.  అతని వద్దకు వెళ్లి పోలీసులు విచారించగా.. తన కారు ఎక్కడికి తీసుకెళ్లలేదని, ఎవ్వరికి తాను కారు ఇవ్వలేదని యాజమాని తెలిపాడు. దీంతో అదే నంబరు ప్లేటుతో మరో కారును దుండగు‌లు వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇక రూ.2వేల నోట్లు చెల్లవు? RBI క్లారిటీ

రాధ హత్యకు ముందుగానే స్కెచ్..

అప్పు తీసుకున్న రూ. 80లక్షల్లో కొంత డబ్బును ఇస్తాను రావలసిందిగా రాధకు నిందితుడు కాశిరెడ్డి మెసేజ్‌ చేసిన ఫోన్‌ నంబరుకూడా హైదరాబాద్‌లో చెరుకు రసం విక్రయించే మహిళదిగా పోలీసుల గుర్తింపు. ఈ విషయంపై చెరుకు రసం వ్యాపారం చేసే మహిళను పోలీసులు ప్రశ్నించగా.. ఒక వ్యక్తి తన వద్ద ఫోన్‌ మాట్లాడాలని చెప్పి అందులో సిమ్‌ను తీసి సెల్‌ ఇచ్చాడని చెరుకు రసం విక్రయించే మహిళ తెలిపింది. కారు నంబరు ప్లేటు మార్చడం, ఫోన్‌ సిమ్‌కార్డు ముందుగానే దొంగిలించడం చూస్తే రాధను అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసుల అనుమానాలు. రాధను ఇంకోచోట హత్య చేసి తెచ్చి అక్కడ పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కారుతో తొక్కించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు లేక నలుగురు వ్యక్తులు పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది కిరాయిహంతకులు పనేఅని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసులో పురోగతి సాధించామని ఇందుకు సంభందించిన కీలక ఆధారాలు లభించాయని ఎస్పీ మలిక గర్గ్ చెప్పారు.