Ambati Rambabu : చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఏమో అయిపోతుంది అన్నారు, మరిప్పుడు ఏమైంది?- మంత్రి అంబటి రాంబాబు
చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పెద్ద పెద్ద లాయర్లు వచ్చినా, మీరు పొలిటికల్ గా ఎంత గందరగోళం చేసినా ప్రయోజనం లేదు. Ambati Rambabu - Chandrababu Arrest

Ambati Rambabu - Chandrababu Arrest
Ambati Rambabu – Chandrababu Arrest : టీడీపీ-జనసేన పొత్తుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఆయన ఫ్యామిలీకంటే ఎక్కువగా పవన్ కల్యాణ్ బాధపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తప్పు చేశారని, సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
స్కిల్ స్కామ్ మాత్రమే కాదు ఇంకా అనేక కుంభకోణాలు చంద్రబాబు చేశారని ఆయన ఆరోపించారు. ఇన్నాళ్లు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు ఈసారి మాత్రం అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఏదో జరిగిపోతుందన్నారు, చివరికి ఏమైందో అందరికీ తెలుసన్నారు మంత్రి అంబటి రాంబాబు.
”ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. ప్రజలు మా పక్షాన ఉన్నారు. వారి పక్షాన లేరు. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఏమో అయిపోతుంది అన్నారు. ఏమీ కాలేదుగా. కృతిమ ఉద్యమాలు కూడా రావడం లేదు. ఇది వాస్తవం. చంద్రబాబు దొంగ. ఇది ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు. అనేక స్కామ్ లు చేశారు. ఈ రాష్ట్రంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినా చంద్రబాబు అరెస్ట్ చేయడం కష్టం అన్నారు. అన్ని వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తారు అని అనుకునే వారికి ఆశ్చర్యం వేసింది. దొరకని దొంగను కూడా పట్టుకుంది ఈ ప్రభుత్వం.
Also Read..TDP- Janasena: జనసేన, టీడీపీ పొత్తు.. ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి?
దేశంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకోవాలని చూస్తున్నారు. జగన్ ను వ్యతిరేకించే అందరితోనూ కలుస్తాను అని పవన్ అన్నారు. చంద్రబాబుతో కలిస్తే మునిగిపోతారు అని అందరికీ తెలుసు. పవన్ కల్యాణ్ కు ఆ విషయం తెలియకపోవచ్చు. దేశంలోనే ప్రముఖ లాయర్, అత్యధికంగా అమౌంట్ తీసుకునే సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా వచ్చి 10 గంటల పాటు ఓ చిన్న కోర్టులో వాదనలు వినిపించారు. అయినా చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. చట్టం చాలా స్ట్రాంగ్ గా దొంగను పట్టుకుంది. చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పెద్ద పెద్ద లాయర్లు వచ్చినా, మీరు పొలిటికల్ గా ఎంత గందరగోళం చేసినా ప్రయోజనం లేదు. పక్కా సాక్ష్యాధారాలతో చంద్రబాబు దొరికిపోయారు.
Also Read..TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?
చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ గగ్గోలు పెడుతోంది. చంద్రబాబు ఫ్యామిలీకంటే పవన్ కల్యాణ్ ఎక్కువ బాధపడుతున్నారు. పవన్ ను నమ్ముకున్న వారు ఆలోచన చేయాలి. పవన్ కల్యాణ్ పొత్తు నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారు. పవన్, చంద్రబాబు కలుస్తారని మేము ఎప్పుడో చెప్పాం” అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.