Solar Eclipse 2022 : గ్రహణం రోజున కూడా తెరిచి ఉంచే ఆలయం .. అపసవ్యక్షేత్రంగా పేరొందిన అద్భుత పుణ్యక్షేత్రం

గ్రహణం రోజున కూడా తెరిచి ఉంచే అరుదైన ఆలయం..అపసవ్యక్షేత్రంగా పేరొందిన అద్భుత దేవాలయం.

Solar Eclipse 2022 : గ్రహణం రోజున కూడా తెరిచి ఉంచే ఆలయం .. అపసవ్యక్షేత్రంగా పేరొందిన అద్భుత పుణ్యక్షేత్రం

solar eclipse 2022..Sri kalahastiswara

Solar Eclipse 2022 :’సూర్యగ్రహణం సందర్భంగా ఆలయాల మూసివేత’గ్రహణం సమయంలో పలు ఆలయాలను మూసివేస్తుంటారు. భక్తులను కాపాడే దేవుడు కూడా గ్రహణం నియమాలు పాటించాల్సిందేనా? గ్రహణం అంటే చెడు సంకేతం అని అంటారు. చెడు నుంచి కాపాడే భగవంతుడు కొలువై ఉండే దేవాలయాలను కూడా ఎందుకు మూసివేస్తారు? గ్రహణం దృష్టి (రాహు,కేతువుల) దృష్టి ప్రభావం భగవంతుడిపై కూడా పడుతుందా? అనే ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి. మంగళవారం (అక్టోబర్ 25,2022)సూర్యగ్రహణం సందర్భంగా దేవాలయాలను మూసివేయటానికి కారణాలేమిటి? కానీ గ్రహణం రోజున కూడా తెరిచి ఉండే ఓ అరుదైన దేవాలయం గురించి తెలుసుకుందాం..గ్రహణం సమయంలో గుడిని మూసివేస్తారు? ఎంత సేపు మూసివేస్తారు? సంప్రోక్షణ ఎప్పుడు చేస్తారు? వంటి వివరాలను తెలుసుకుందాం..

‘తల్లి గర్భం అత్యంత పవిత్రమైన స్థలం. ఎందుకంటే అక్కడ ఒక సృష్టి జరుగుతుంది. కొత్త జీవి ప్రాణం పోసుకుంటుంది. ఆ జీవి సర్వ అంగాలతో సంపూర్తిగా ఈ భూమ్మీదకు రావాలంటే గ్రహణం ప్రభావం పడకుండా కాపాడుకోవాలి. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అలాగే గర్భగుడిలోనూ దేవుడు ఉంటాడు. గర్భ గుడి అంటూ అమ్మ పుట్టిల్లు అనే కదా? దేవుడు కొలువైన దేవాలయం కూడా అంతటి పవిత్రమైనదే. ఎందుకంటే దేవుడు సృష్టికర్త కాబట్టి.. తల్లి గర్భం మాదిరిగానే గర్భగుడిని కూడా రక్షించుకోవాలి.

Solar Eclipse : రేపు సూర్యగ్రహణం.. తిరుమల శ్రీవారి ఆలయం, దుర్గగుడి, శ్రీశైలం సహా దేవాలయాలు మూసివేత

గ్రహణం సమయంలో దుష్ట శక్తుల ప్రభావం ఉంటుంది. అందువల్ల దేవాలయాలను మూసివేస్తారు’ అని పండితులే కాదు ఆస్ట్రాలర్ కూడా చెబుతున్నారు. అంతేకాదు దుష్టశక్తుల ప్రభావం నుంచి కాపాడుకోవటమే కాకుండా ‘బ్రాహ్మణులు అగ్నిహోత్రం చేయడానికే’ఆలయాలు మూసివేస్తారని అంటున్నారు మరికొంతమంది. ఆగమం, వైదిక శాస్త్రాలలో గ్రహణ సమయాల్లో ఆలయాలు మూసివేయాలని ఉందని పండితులు చెబుతున్నారు.

‘నిత్యకర్మలను అనుసరించి బ్రాహ్మణులు సంధ్యావందనం, అగ్నిహోత్రం (యగ్నం చేసి అగ్నిని ఆహ్వానించడం) చేయాల్సి ఉంటుంది. అది కూడా సొంత అగ్నిహోత్రం ప్రకారం గ్రహణ హోమాలు చేసుకోవాలి.దేవాలయాల్లో అర్చకులుగా పని చేసే బ్రాహ్మణులు గుడిలో ఉంటే సొంత అగ్నిహోత్రం ప్రకారం గ్రహణ హోమాలు చేయలేరు. అందువల్లే దేవాలయాలను మూసివేస్తారని చెబుతున్నారు.

వేదాల ప్రకారం.. బ్రాహ్మణులు ఎవరి అగ్నిహోత్రం ప్రకారం వారు గ్రహణ హోమాలు చేసుకోవాలి. ఇంట్లోనే భార్యభర్తలు ఇద్దరు కలిసి అగ్నిహోత్రం చేయాలి.దీని వల్ల గుడిలోకి వెళ్లి పూజలు చేసే బ్రాహ్మణులు గ్రహణ నియమాలు పాటించాలి కావట్టి ఆ సమయంలో అర్చక కార్యక్రమాలు నిర్వహించటానికి వీలు ఉండదు కాబట్టి ఆలయాలను మసివేస్తారని చెబుతుంటారు. అర్చకత్వం చేసే బ్రాహ్మణులు స్వధరాన్ని పాటించకపోతే బ్రాహ్మణత్వాన్ని కోల్పోతారు. అప్పుడు గుడిలో పూజలు చేయడానికి వారికి అర్హత ఉండదు. అందుకే గ్రహణం సమయంలో వారు నియమాలన్ని పాటించాల్సి ఉంటుంది.అందువల్ల గ్రహణం రోజున గుడులను మూసివేసే ఆచారాన్ని తీసుకొచ్చారు. అయితే కొన్ని ఆగమాల ప్రకారం గుడులలో హోమాలు చేసేవారు కూడా ఉన్నారని చెబుతున్నారు పండితులు.

సూర్యగ్రహణం రోజున కూడా తెరిచి ఉంచే శివయ్య ఆలయం..
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయాన్ని మాత్రం గ్రహణం రోజున తెరచే ఉంచుతారు. ఇది చాలా కాలంగా వస్తున్న సంప్రదాయంగా కొనసాగుతోంది.ఇందుకు అనేక కారణాలున్నాయి. శ్రీకాళహస్తిలో పూజలందుకునే శివయ్యను శ్రీకాళహస్తీశ్వర స్వామిగా పేరొందాడు.

Surya Grahan 2022: నేడు సూర్య గ్రహణం.. ఏఏ రాశుల వారికి శుభ ఫలితాలనిస్తుందంటే?

మూగజీవులు ప్రాణార్పణం చేసే స్థలం..
శ్రీ అంటే సాలె పురుగు… కాళం అంటే పాము… హస్తి అంటే ఏనుగు… ఈ మూడు జంతువులు ఇక్కడ పూజలు చేసి శివునిలో ఐక్యం అయ్యాయి.ఇక్కడ శివుడు పాము రూపంలో ఉంటారు. ఆయన శిరస్సు మీద అయిదు తలల సర్పం ఉంటుంది. అలాగే జ్ఞాన ప్రసూనాంబగా పిలుచుకునే అమ్మవారి నడుముకు నాగాభరణం ఉంటుంది.ఈ దేవాలయంలో రాహు కేతువులు ఉన్నారు. అందువల్ల శ్రీకాళహస్తి దేవాలయం రాహు కేతు క్షేత్రంగా పేరొందింది.సూర్యగ్రహణమైనా లేక చంద్రగ్రహణమైనా సూర్యచంద్రులను కబళించేది రాహు కేతువులే. (శాస్త్రం ప్రకారం)గ్రహణం సమయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అలాగే భక్తులు కూడా వచ్చి రాహు కేతు దోష నివారణ పూజలు చేయించుకుంటారు. స్వామి, అమ్మవారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషమే కాకుండా నక్షత్ర, నవ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.

అపసవ్య దిశలో ప్రదక్షిణలు చేసే దేవాలయం..
శ్రీకాళహస్తిని దక్షిణ కాశి అని అంటారు. ఇక్కడ ఇక్కడ స్వామివారు. పార్వతి అమ్మవారు ప్రత్యక్షంగా నివసిస్తుంటారట. ఈ క్షేత్ర పురాణం ప్రకారం రాహు కేతువులకు శివుడు గ్రహాధిపత్యం ఇచ్చారు.ఈ దేవాలయంఈ దేవాలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ గ్రహాల్లో ఏడు గ్రహాలు సవ్వ దిశ (ఎడమ నుంచి కుడికి)లో ప్రదక్షిణలు చేస్తుంటాయి. గ్రహణానికి కారణమయ్యే రాహు, కేతువు గ్రహాలు అపసవ్య దిశలో తిరుగుతుంటాయి.

అందువల్ల ఇది అపసవ్యక్షేత్రం. అంటే ఇక్కడ అపసవ్యవ ప్రదక్షిణలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ భిన్నమైన ఆచారం ఉంది. శైవాగమంలో అఘోరపరమైన సంప్రదాయం ప్రకారం ఇది జరుగుతూ ఉంటుంది.ఇక్కడ దేవునికి నవగ్రహ కవచం ఉంటుంది. ఇటువంటి ప్రత్యేక కారణాల వల్ల శ్రీకాళహస్తికి గ్రహణ దోషం ఉండదని పండితులు చెబుతున్నారు.

శ్రీకాళహస్తి చరిత్ర..
వాయు దేవుని కోరిక మేరకు శివుడు ఇక్కడ కర్పూర వాయులింగంగా వెలిశాడు. అంతేకాదు..శివయ్య సన్నిథిలో ఆయన సేవలో ప్రాణాలు కోల్పోయిన మూడు మూగ జీవుల పేరుతో వెలిసిన క్షేత్రం శ్రీకాళహస్తి.సాలీడు, పాము, ఏనుగు పూజలు చేయడం వల్ల దీనికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందంటారు.

శ్రీకాళహస్తికి ప్రాచుర్యం రాక ముందు స్థానిక ఆదివాసీలు పూజలు చేసేవారట. 9వ శతాబ్దంలో పల్లవులు, చోళులు ఈ గుడిని నిర్మించారని చరిత్ర చెబుతోంది. గుడి గోపురాన్ని కులోత్తంగ చోళ కట్టించాడు.

ఈ దేవాలయం విజయనగర సామ్రాజ్యంలో భాగంగా కూడా ఉండేది. ఈ క్రమంలో 1516లో గజపతులను ఓడించిన సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాళహస్తి దేవాలయంలో రాజగోపురం కట్టించాడు. విజయనగర పాలకుల కాలంలో తిరుపతి, తాడిపత్రి, పెనుకొండలో కట్టిన శైవ, వైష్ణవ దేవాలయాల నిర్మాణ శైలులు శ్రీకాళహస్తికి దగ్గరగా ఉంటాయి.