టీడీపీకి భారీ షాక్.. వైసీపీలో చేరిన సీనియర్ నాయకులు

తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

టీడీపీకి భారీ షాక్.. వైసీపీలో చేరిన సీనియర్ నాయకులు

Updated On : April 25, 2024 / 4:08 PM IST

TDP Leaders Joins YSRCP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. సీఎస్ఐ గ్రౌండులో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పులివెందులలోని మిని సెక్రటేరియట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసి.. భకరాపురంలోని తన నివాసానికి చేరుకున్నారు.

సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో కమలాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత వీరశివారెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ కండువాతో ఆయనను సీఎం జగన్ సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి (టీడీపీ) సోదరుడు శ్రీనాథ్‌ రెడ్డి, ఆయన సతీమణి అనీషా రెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పుంగనూరులో టీడీపీ తరపున అనీషా రెడ్డి పోటీ చేశారు.

Also Read: వీళ్లా వైఎస్ఆర్ వారసులు? పులివెందుల సభలో షర్మిలకు సీఎం జగన్ కౌంటర్