Sonu sood Oxygen : చిత్తూరు వాసికి ఊపిరిపోసిన సోనూసూద్

కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తున్న రియల్‌ హీరో సోనూసూద్‌ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఓ తెలుగు వ్యక్తికి ఆయన ఊపిరిపోశారు.

Sonu sood Oxygen : చిత్తూరు వాసికి ఊపిరిపోసిన సోనూసూద్

Sonu Sood Oxygen

Sonu sood Oxygen : కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తున్న రియల్‌ హీరో సోనూసూద్‌ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఓ తెలుగు వ్యక్తికి ఆయన ఊపిరిపోశారు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలోని గుడుపల్లె రైల్వేస్టేషన్‌ సమీపంలో నివసిస్తున్న నాగేష్‌ (55) ఇటీవల కరోనా బారినపడ్డారు. ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ఆక్సిజన్‌తోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సొంతంగా ఆక్సిజన్‌ కాన్సన్ ట్రేటర్‌ కొనుగోలు చేసేంత స్తోమత లేదు. దీంతో విషయాన్ని స్థానిక చిత్రకారుడు పురుషోత్తం దృష్టికి తీసుకెళ్లారు.

ఆయన ఈ సమాచారాన్ని సోనూసూద్‌కు చేరవేశారు. వెంటనే స్పందించిన సోనూసూద్ ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ పంపారు. అదేరోజు రాత్రికల్లా సోనూ పంపిన ఆక్సిజన్‌ కాన్సన్ ట్రేటర్‌ నాగేష్ కు అందింది. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన సోనూసూద్ కు నాగేష్, అతడి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సోనూసూద్ సాయం పట్ల అంతటా హర్షం వ్యక్తమవుతోంది.

కరోనా కష్టకాలంలో బాధితులకు ఆపద్బాంధవుడయ్యారు సోనూ సూద్. కొవిడ్ బాధితులకు పలు రకాలుగా సాయం అందిస్తున్నారు. ఆక్సిజన్, బెడ్స్, ఇంజెక్షన్స్.. ఇలా ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా ఆదుకుంటున్నారు.

బాలీవుడ్ బిగ్ బాస్ ల నుంచి.. ప్రధాని లాంటి వారికి రాని క్రేజ్ ఇప్పుడు సోనూ సూద్ సొంతమైంది. అందుకు కారణం సోనూ సేవలే. ముఖ్యంగా సాయం చేయండి అని ఎవరైనా అడిగితే చాలు.. నేను ఉన్నాను అంటూ ముందుకు వస్తున్నారు. కేవలం మాటలు చెప్పడం కాదు.. వారికి సాయం అందే వరకు అన్నీ తానే చూసుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం సాయం కోసం సోనూను ఆశ్రయిస్తున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా కరోనా కష్ట కాలంలో అందరికీ దేవుడిలా మారారు సోనూ సూద్. ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆయనకే చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా కొందరు.. ఆయన ఫౌండేషన్ సభ్యుల ద్వారా కొందరు తమ బాధలు చెప్పుకుంటున్నారు. సాయం అడిగిన వారందరికీ నేను ఉన్నాననే భరోసా ఇస్తున్నారు సోనూ సూద్.