Srisailam : కృష్ణానదికి భారీ వరద.. శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తిన అధికారులు

ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి.

Srisailam : కృష్ణానదికి భారీ వరద.. శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తిన అధికారులు

Srisailam

Srisailam : ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఈ నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణానదిపై ఉన్న బహుళార్ధసాధక ప్రాజెక్టు శ్రీశైలం 7 ఏడు గేట్లు 10 అడుగుల మేర ఎట్టి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Read More : Two Goggles auction : వేలానికి రెండు కళ్లజోళ్లు..ధర రూ.రూ.25 కోట్లు

శ్రీశైలం జలాశయానికి 2,04,279 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుండగా.. 2,54,778 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.3637 గా నీటి నిల్వ ఉంది.

Read More : Revanth Reddy : శశిథరూర్‌‌కు రేవంత్ రెడ్డి క్షమాపణలు, వివాదానికి ఫుల్ స్టాప్

శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుతుత్పత్తి కొనసాగుతోంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరింది. దీంతో 10 గేట్లు వదిలి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.