Andhra Pradesh : రజనీకాంత్‌పై వైసీపీ నేతల విమర్శలకు టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ .. వాళ్లకాళ్లు పట్టుకున్న వాళ్లా మాట్లాడేది? అంటూ ఎద్దేవా

తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు విమర్శలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల కాళ్లు పట్టుకుని ఎదిగినవారా? ఇటువంటి వ్యాఖ్యలు చేసేది సిగ్గులేదా అంటూ స్ట్రాంగ్ కౌంటర్.

Andhra Pradesh : రజనీకాంత్‌పై వైసీపీ నేతల విమర్శలకు టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ .. వాళ్లకాళ్లు పట్టుకున్న వాళ్లా మాట్లాడేది? అంటూ ఎద్దేవా

Rajinikanth..Chandrababu

Andhra Pradesh :  తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు, విమర్శలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలకు హాజరైన రజనీకాంత్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గురించి ఆయన విజన్ గురించి మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు.

రజనీకాంత్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. ఏపీలో జీరో అయిన రజినీకాంత్, సిగ్గుశరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడంటూ విమర్శించారు. వైసీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. రజనీకాంత్ రాజకీయాలు మాట్లాడలేదు.. రజనీకాంత్ మీద పడి వైసీపీ నేతలు ఎందుకు ఏడుస్తున్నారు..? అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.చంద్రబాబు విజన్ గురించి.. ఎన్టీఆర్ గురించి రజనీకాంత్ మాట్లాడితే వైసీపీ నేతలకేమైంది..?చంద్రబాబు.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల కాళ్లు పట్టుకున్న వాళ్లా మాట్లాడేది? అంటే ఎద్దేవా చేశారు.గతంలో రోజా చంద్రబాబు గురించి ఏం మాట్లాడారో గుర్తుంచుకుని మాట్లాడాలని..ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు చేసుకుంటే వైసీపీకేంటీ కడుపు మంట..?అంటూ ప్రశ్నించారు.

NTR 100 jayanathi : చంద్రబాబు ఇంటికి రజనీకాంత్‌తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు,మరి పురంధేశ్వరి, తారక్ వచ్చేనా?ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరవుతారా?

వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు,తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మాట్లాడుతు..రజనీకాంత్ మాట్లాడాక.. ఇంకా వైసీపీ వాళ్లు మాట్లాడలేదేంటా? అనుకున్నాం..ఇంకేముంది ఇక పేటీఎం బ్యాచ్ నోళ్లకు పని చెప్పారు అంటూ సెటైర్లు వేశారు. రజనీ కాంత్ మీద ఉదయాన్నే ఊర కుక్కలు మాట్లాడుతున్నాయి.రజనీకాంత్ మీద విమర్శలు చేశారంటే.. నిన్నటి సభ ఎంత సక్సెస్ అర్థమైంది అని అన్నారు. ఇరవై ఏళ్ల క్రితం చంద్రబాబు లేరా..? హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర లేదా..? అప్పుడు టీడీపీలో ఉన్న రోజాకు ఈ విషయం తెలియదా?ఇంగితం లేకుండా రోజా నోటికి అద్దు అదుపులేకుండాపోతోందని నోరేసుకుని పడమని సీఎం జగన్ వదిలేశారంటూ సెటైర్లు వేశారు అనిత. ఇరవై ఏళ్ల క్రితం చంద్రబాబు విజన్.. మేధో సంపత్తి గురించి ఇదే రోజా మాట్లాడారని ఇప్పుడు మాత్రం చంద్రబాబు గురించి అవాకులు చవాకులు వాగుతున్నారంటూ మండిపడ్డారు. రజనీకాంత్ పైనా విమర్శలు చేస్తున్నారంటే వైసీపీ భజన బృందం మైండ్ చిప్ లు దొబ్బాయి అంటూ కౌంటర్ ఇచ్చారు. రజనీ ఆరోగ్యం గురించి కూడా వైసీపీ నేతలు మాట్లాడతారా..? వీళ్ల మొహలు మండా..అంటూ తిట్టిపోశారు.రోజా లాంటి చంద్రముఖిలను తొక్కి తొక్కి రజనీ కాంత్ బయటకొచ్చారని..బాబాయిని హత్య చేసిన వాళ్లు కూడా వెన్నుపోటు గురించి మాట్లాడేవారా..? అంటూ ఎద్దేవా చేశారు. రజనీకాంత్ గురించి మాట్లాడే కనీస అర్హత కూడా లేని కొడాలి నాని కడుపు అన్నమే తింటున్నారా..? అంటూ దుయ్యబట్టారు.

అలాగే వైసీపీ నేతలపై టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతు సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి రోజా మాట్లాడటం కరెక్ట్ కాదని సూచించారు. రజనీకాంత్ కండక్టర్ స్థాయి నుంచి ఎదిగానని చెప్పిన గొప్ప మనిషి అని అటువంటి గొప్పమనిషి గురించి ఇటువంటి నేలబారు వ్యాఖ్యలు చేయటం తగదు అన్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి రోజా చేసి వ్యాఖ్యలు వింటే తమిళసోదరులు రోజా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నారు. ఇష్టానుసారంగా ఇటువంటి వ్యాఖ్యలు తగదన్నారు. నీ మాటలను వెనక్కి తీసుకో రోజా..
అంటూ సూచించారు. ఇక వైసీపీ ఎంపీ అవినాష్ పని అయిపోయింది..రేపో మాపో అరెస్టు చేయటం ఖాయం అని అన్నారు వర్ల రామయ్య.

Andhra Pradesh: సూపర్ స్టార్ రజనీకాంత్‌పై కొడాలి నాని, మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

రజినీకాంత్ పై కొడాలి వ్యాఖ్యలు..
ఏపీలో జీరో అయిన రజినీకాంత్, సిగ్గుశరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజినీకాంత్‌ను చంద్రబాబు రంగంలోకి దించాడని, చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ కళ్యాణ్ గ్రహించాలని కొడాలి నాని సూచించారు.ఎన్టీఆర్‌పై చెప్పులు విసురుతుండగా వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతు  తెలిపిన రజినీకాంత్.. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగడడం సిగ్గుచేటు అన్నారు. వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రజలేవరూ పట్టించుకోరని కొడాలినాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్టీఆర్ బతికుండగా రజినీకాంత్ ఏం చేశాడు..? ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అంటూ నాని ప్రశ్నించారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే.. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజినీకాంత్ తెలుగు ప్రజలకేం చెప్తాడని కొడాలి నాని ఘటుగా విమర్శలు చేశారు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రజినీకాంత్ చదువుతూ తను వ్యక్తిగా మరింత దిగజారుతున్నాడంటూ నాని అన్నారు.

రోజావ్యాఖ్యలు..
ఎన్టీఆర్ జయంతి సభలో రజనీకాంత్ వ్యాఖ్యలు హస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి రోజా అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన బాబు‌ను పొగడటం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. సభకు పిలిచారు కాబట్టి బాబును పొడిగినట్లుగా ఉందని రోజా అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన విషయం రజనీకాంత్‌కు తెలియదా అంటూ రోజా ప్రశ్నించారు. బాబు అధికారంలో ఉండగా ఎన్టీఆర్‌కు భారత రత్న అంశం గుర్తుకు రాదంటూ విమర్శించారు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్న ఎన్టీఆర్ చావుకు బాబు కారణమంటూ ఆరోపించారు. 2013 వరకే బాబు హైదరాబాదు‌కు సీఎంగా ఉన్నారని, 20 ఏళ్ల పాటు బాబు లేకుండానే హైదరాబాదు అభివృద్ధి చెందిందని గుర్తించాలని రోజా సూచించారు.