Andhra Pradesh: సూపర్ స్టార్ రజనీకాంత్‌పై కొడాలి నాని, మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాల గురించి రజనీకాంత్‌కి ఏం తెలుసని మాట్లాడుతున్నారంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ పై మంత్రి రోజా, వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ప్రశ్నించారు.

Andhra Pradesh: సూపర్ స్టార్ రజనీకాంత్‌పై కొడాలి నాని, మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

Roja and Kodali Nani,

Andhra Pradesh:  నందమూరి తారాక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. రజనీకాంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీలో జీరో అయిన రజినీకాంత్, సిగ్గుశరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజినీకాంత్‌ను చంద్రబాబు రంగంలోకి దించాడని, చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ కళ్యాణ్ గ్రహించాలని కొడాలి నాని సూచించారు.

Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి పయనం ఎటు.. తర్వాతి అడుగు ఎటువైపు?

ఎన్టీఆర్‌పై చెప్పులు విసురుతుండగా వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతు  తెలిపిన రజినీకాంత్.. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగడడం సిగ్గుచేటు అన్నారు. వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రజలేవరూ పట్టించుకోరని కొడాలినాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్టీఆర్ బతికుండగా రజినీకాంత్ ఏం చేశాడు..? ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అంటూ నాని ప్రశ్నించారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే.. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజినీకాంత్ తెలుగు ప్రజలకేం చెప్తాడని కొడాలి నాని ఘటుగా విమర్శలు చేశారు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రజినీకాంత్ చదువుతూ తను వ్యక్తిగా మరింత దిగజారుతున్నాడంటూ నాని అన్నారు.

NTR 100 jayanathi : చంద్రబాబు ఇంటికి రజనీకాంత్‌తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు,మరి పురంధేశ్వరి, తారక్ వచ్చేనా?ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరవుతారా?

మంత్రి రోజా కామెంట్స్ ..

ఎన్టీఆర్ జయంతి సభలో రజనీకాంత్ వ్యాఖ్యలు హస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి రోజా అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన బాబు‌ను పొగడటం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. సభకు పిలిచారు కాబట్టి బాబును పొడిగినట్లుగా ఉందని రోజా అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన విషయం రజనీకాంత్‌కు తెలియదా అంటూ రోజా ప్రశ్నించారు. బాబు అధికారంలో ఉండగా ఎన్టీఆర్‌కు భారత రత్న అంశం గుర్తుకు రాదంటూ విమర్శించారు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్న ఎన్టీఆర్ చావుకు బాబు కారణమంటూ ఆరోపించారు. 2013 వరకే బాబు హైదరాబాదు‌కు సీఎంగా ఉన్నారని, 20 ఏళ్ల పాటు బాబు లేకుండానే హైదరాబాదు అభివృద్ధి చెందిందని గుర్తించాలని రోజా సూచించారు.

Rajinikanth: ఎన్టీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం చాలా ప్రత్యేకం – రజినీకాంత్

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్ ..

ఏపీ రాజకీయాల గురించి రజనీకాంత్‌కి ఏం తెలుసు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆయన 10tv తో మాట్లాడుతూ.. సినిమాల్లో సూపర్ స్టార్ కావచ్చు. ఏపీ రాజకీయాల్లో మాత్రం ఆయనకు అవగాహన లేదని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు వైస్రాయ్ హోటల్‌లో చంద్రబాబుకి మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ వెంటిలేటర్‌పై టీడీపీకి మద్దతు కోసం తీసుకుని వచ్చాడు అంటూ విమర్శించారు. 2047లో ఏదో చేస్తారని రజనీకాంత్ చెప్తున్నాడు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడు. ఐదేళ్లు అమరావతిలో టెంపరరీ కట్టడాలు కట్టి అభివృద్ధి చేయకుండా ఉన్నది రజినీకాంత్ కి తెలియదా అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.