క్వారంటైన్లకు వెళ్లేందుకు విద్యార్థుల నిరాకరణ…హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం

సీఎం జగన్ ఆదేశాల మేరకు జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు. అయితే క్వారంటైన్లకు వెళ్లేందుకు కొంతమంది అంగీకరిస్తే..మరికొంత మంది నిరాకరిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : March 25, 2020 / 08:58 PM IST
క్వారంటైన్లకు వెళ్లేందుకు విద్యార్థుల నిరాకరణ…హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం

సీఎం జగన్ ఆదేశాల మేరకు జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు. అయితే క్వారంటైన్లకు వెళ్లేందుకు కొంతమంది అంగీకరిస్తే..మరికొంత మంది నిరాకరిస్తున్నారు.

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ విద్యార్థులు స్వంత ఊళ్లకు పయనమయ్యారు. ఏపీ ప్రభుత్వం మొదటగా అనుమతించకపోయినా తర్వాత అనుమతించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులను ఏపీలోకి అనుమతించారు. అక్కడున్న విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌ చర్చించారు.

కోవిడ్‌–19 నివారణలో భాగంగా ప్రస్తుతం ఎక్కడి వారిని అక్కడే ఉండేట్టుగా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే జగ్గయ్యపేట వద్ద ప్రస్తుతం వేచిచూస్తున్న ఏపీ వారికి హెల్త్‌ ప్రోటోకాల్‌ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు. ప్రస్తుతం అక్కడున్న వారందరినీ ఏపీకి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన విద్యార్థులను రాష్ట్రంలోకి అనుమతించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

విద్యార్థుల సమస్యలపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. వారిని అనుమతించాలని సీఎం.. పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మెడికల్ ప్రోటోకాల్ తర్వాతే పోలీసులు వారిని అనుమతించనున్నారు. ఇప్పుడున్న వారు తప్ప కొత్తగా వచ్చేవారిని అనుమతించేది లేదని పోలీసులు అంటున్నారు. సీఎం ఆదేశాలు మేరకు ఇప్పుడు అక్కడ స్పాట్ లో ఉన్న వారందరినీ ఏపీలోకి అనుమతిస్తారు. అయితే మెడికల్ ప్రోటోకాల్ పాటించి మాత్రమే అనుమతిస్తారు. కొత్తగా ఎవర్ని అనుమతించరు. ఈరోజు అక్కడ ఉన్న వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

ప్రత్యేక బస్సుల ద్వారా హెల్త్‌ప్రోటో కాల్‌ కోసం అధికారులు వారిని తరలిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం వారిని క్వారంటైన్‌ చేస్తున్నారు. పగడ్బందీగా హెల్త్‌ ప్రోటోకాల్‌ను అధికారులు పాటిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల వారిని నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి తరలిస్తున్నారు. ఈస్ట్‌ గోదావరి వారిని రాజమండ్రి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. వెస్ట్‌గోదావరి తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్లకు తరలిస్తున్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఫలితాల ఆధారంగా స్వస్థలాలకు పంపాలని నిర్ణయించారు.

అయితే క్వారంటైన్లకు వెళ్లేందుకు కొంతమంది అంగీకరిస్తే..మరికొంత మంది నిరాకరిస్తున్నారు. తాము క్వారంటైన్లకు వెళ్లబోమని హైదరాబాద్ కు తిరిగి వెళ్తామని చెబుతున్నారు. వెంటనే కొంతమంది విద్యార్థులు తిరుగుప్రయాణం అయ్యారు. క్వారంటైన్ కు తరలించడం పట్ల విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వంతూళ్లకు వెళ్లాలనుకున్న వారికి నిరాశ ఎదురైంది. దీంతో క్వారంటైన్లకు వెళ్లేదానికి కంటే హైదరాబాద్ కు తిరిగి వెళ్లడం మంచిదని భావిస్తున్నారు. ఆ మేరకు కొంతమంది విద్యార్థులు హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు. 

అంతకముందు తెలంగాణ ప్రభుత్వం ఎన్ వోసీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం అనుమతించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణకు తిరిగి వెళ్లాలో..ఆంధ్రప్రదేశ్ లోకి అనుమతిస్తారో తెలియక అయోమయానికి గురయ్యారు. మరోవైపు విద్యార్థుల సమస్యలపై స్పందించిన ఏపీ మంత్రి బొత్స, తెలంగాణ మంత్రి కేటీఆర్ తో మాట్లాడారు. ఈ సమయంలో హాస్టళ్లు ఖాళీ చేయిస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పారు. 

దీంతో వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. హాస్టళ్లు, మెస్సులు మూసివేయకుండా చూడాలని జీహెచ్ ఎంసీ మేయర్ ను ఆదేశించారు. మరోవైపు హాస్టళ్లు,మెస్సులు మూసివేయొద్దని యాజమాన్యాలకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తదుపరి చర్యలు వచ్చే వరకు ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించారు. 

See Also | జగ్గయ్యపేట వద్ద వేచివున్న విద్యార్థులకు ఏపీలోకి అనుమతి…ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్లకు తరలింపు