Supreme Court : ఏపీ విభజన బిల్లుపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

పార్లమెంట్ తలుపులు మూసి వేసి, లోక్ సభ ప్రత్యక్షం నిలిపి వేసి అశాస్త్రీయ రీతిలో విభజన చేశారంటూ.. నాడు ఎంపీగా ఉన్న తనను కూడా సభ నుంచి బయటికి పంపించి వేశారని తెలిపారు.

Supreme Court : ఏపీ విభజన బిల్లుపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Supreme Court (2)

Updated On : August 23, 2023 / 8:20 AM IST

Supreme Court – AP Bifurcation Bill : ఏపీ విభజన బిల్లుపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విభజన బిల్లుపై విచారణ సందర్భంగా ఇది ఎవరికి సంబంధించిన బిల్లు అంటూ పిటిషనర్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏపీ విభజన బిల్లు చట్టబద్ధంగా పార్లమెంట్ లో ఆమోదం పొందలేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై విచారణ కొనసాగగా, కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపించారు.

పార్లమెంట్ తలుపులు మూసి వేసి, లోక్ సభ ప్రత్యక్షం నిలిపి వేసి అశాస్త్రీయ రీతిలో విభజన చేశారంటూ.. నాడు ఎంపీగా ఉన్న తనను కూడా సభ నుంచి బయటికి పంపించి వేశారని తెలిపారు. సుదీర్ఘ సమయంపాటు చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని అర్ధగంటలో తేల్చేశారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఉండవల్లి అరుణ్ కుమార్ విన్నవించారు.

Chandrayaan 3 landing : చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రోగ్రాంలో వర్చువల్‌గా చేరనున్న మోదీ

పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం ఇది రాజకీయ సమస్య అయినప్పుడు తాము ఎందుకు జోక్యం చేసుకోవాలంటూ ప్రశ్నించింది. ఇది పార్లమెంట్ కు సంబంధించిన విషయం కాబట్టి దీనిలో జోక్యం చేసుకోబోమని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ రవీంద్ర భట్ తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇటువంటి కేసులు చాలానే పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది. విచారణను వాయిదా వేసింది.