TDLP : అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీఎల్పీ నిర్ణయం.. చంద్రబాబు అక్రమ అరెస్టు, ప్రజా సమస్యలపై గళమెత్తాలని లోకేష్ పిలుపు

చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని చట్ట సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఉద్యమించాలని నిర్ణయించారు.

TDLP : అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీఎల్పీ నిర్ణయం.. చంద్రబాబు అక్రమ అరెస్టు, ప్రజా సమస్యలపై గళమెత్తాలని లోకేష్ పిలుపు

AP Assembly Sessions TDLP

Updated On : September 20, 2023 / 1:04 PM IST

TDLP Assembly Sessions : ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని తెలుగుదేశం శాసనసభ పక్షం నిర్ణయం తీసుకుంది. పోరాటమే అజెండాగా పెట్టుకున్నప్పుడు ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో పాటు వివిధ ప్రజా సమస్యలపై గళమెత్తేoదుకు చట్ట సభల వేదికను వదులుకోకూడదన్నారు. సభలో చేయాల్సిన పోరాటం సభలో చేద్దాం, వీధుల్లో చేయాల్సిన పోరాటం వీధుల్లో చేద్దామని లోకేష్ తెలిపారు.

చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని చట్ట సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఉద్యమించాలని నిర్ణయించారు. మైక్ ఇవ్వకపోవడం, సస్పెండ్ వంటి పరిణామాలు చోటు చేసుకుంటే బయటకు వచ్చి నిరసన తెలిపి ప్రజల్లోకి పార్టీ వాదనను బలంగా తీసుకెళ్లాలని శాసనసభ పక్షం నిర్ణయం తీసుకుంది.

Bear : తిరుపతి అలిపిరి నడకమార్గంలో ఎలుగుబంటి కలకలం.. భక్తుల్లో తీవ్ర భయాందోళన

తెలుగుదేశం నేతలు అసెంబ్లీకి వస్తే 70ఎంఎం స్క్రీన్ చూపిస్తామంటూ చేసిన మంత్రుల వ్యాఖ్యలపైనా కీలక చర్చ జరుగనుంది. వైసీపీకి స్క్రీన్ ప్రెజెంటేషన్ అవకాశం ఇస్తే జగన్ అక్రమాస్తుల కేసులపై స్క్రీన్ ప్రెజెంటేషన్ కు పట్టుబట్టాలని తెలుగుదేశం నిర్ణయించింది. సభ లోపల అవకాశం ఇవ్వకపోతే జగన్ అవినీతి బాగోతాన్ని బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇంకా తదుపరి అరెస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతున్నందున అందుకు తగ్గట్టుగా అసెంబ్లీ లోపల, బయటా పార్టీ కార్యాచరణ రూపొందించుకోవాలని కేశవ్ పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశం అయ్యారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జూమ్ ద్వారా టీడీఎల్పీ సమావేశంలో లోకేష్, బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప పాల్గొన్నారు.

AP Assembly Sessions: 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై చర్చించారు. అసెంబ్లీకి వెళ్లకుండా నిరసన తెలపాలని పలువురు నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ సహా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని మెజారిటీ నేతల అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు మరీ అతిగా ప్రవర్తిస్తున్నారని సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.