Somireddy Chandramohan Reddy : టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు-సోమిరెడ్డి

వైసీపీ అరాచకాలకి, అవినీతికి, అక్రమాలకు, దుర్మార్గాలకు ఒక గుణపాఠం చెప్పాలనే పట్టుదల మా యూత్ లో వచ్చింది. మా లీడర్స్ లో వచ్చింది. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పు ఎలా ఉండబోతోంది చెప్పేశారు. రేపటి ఎన్నికల్లో కచ్చితంగా మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. 155 సీట్లు తక్కువ లేకుండా గెలుచుకుంటాం.

Somireddy Chandramohan Reddy : టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు-సోమిరెడ్డి

Somireddy Chandramohan Reddy : ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడింటికి మూడు స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. గ్రాడ్యుయేట్ ఓటర్లు అధికారపక్షానికి షాక్ ఇస్తూ టీడీపీకి పట్టం కట్టారు.

మూడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల విజయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ తెచ్చాయి. ఈ ఫలితాలు ఇది ప్రజా విజయం అని, మార్పునకి సంకేతం అని, మంచికి మార్గం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభివర్ణించారు.

Also Read..Nandamuri Balakrishna : ”వై నాట్ 175” అని సీఎం జగన్ ఇప్పుడంటే వినాలని ఉంది-బాలకృష్ణ

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అన్నారు. ఇదే స్పీడ్ తో అసెంబ్లీ ఎన్నికల్లో 155 సీట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమతో కలిసొచ్చే పార్టీలతో ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు సోమిరెడ్డి.

”పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధించాం. వైసీపీ అరాచకాలకి, అవినీతికి, అక్రమాలకు, దుర్మార్గాలకు ఒక గుణపాఠం చెప్పాలనే పట్టుదల మా యూత్ లో వచ్చింది. మా లీడర్స్ లో వచ్చింది. 108 నియోజకవర్గాల్లో తీర్పు ఇది. మొత్తం 108 నియోజకవర్గాలు. మమ్మల్ని వాళ్లు లైక్ చేస్తున్నారు.

Also Read..CM YS Jagan: ఎందుకు తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి..? ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే ..

తెలుగుదేశం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. మేము ఒక్క రూపాయి కూడా పంచలేదు. మా రాంగోపాల్ రెడ్డి గెలిచాడు. నీ పులివెందుల నుంచి గెలిచాడు. నీ పులివెందుల బిడ్డ. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పు ఎలా ఉండబోతోంది చెప్పేశారు. రేపటి ఎన్నికల్లో కచ్చితంగా మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. 155 సీట్లు తక్కువ లేకుండా గెలుచుకుంటాం” అని సోమిరెడ్డి అన్నారు.

Also Read..Chandrababu : వచ్చే ఎలక్షన్స్ జగన్ పర్సెస్ పబ్లిక్.. ఇక ఏ ఎన్నికల్లోనూ గెలవడు : చంద్రబాబు