KCR Targets AP TDP : ఏపీ టీడీపీని టార్గెట్ చేసిన కేసీఆర్..! బీఆర్ఎస్‌లో చేరాల్సిందిగా నేతలకు ఆహ్వానాలు..!

దేశ రాజకీయాల వైపు చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారా? గతంలో తనతో పని చేసిన టీడీపీ నేతలకు గాలం వేస్తున్నారా? అంటే, అవుననే సమాధానం టీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తోంది.

KCR Targets AP TDP : ఏపీ టీడీపీని టార్గెట్ చేసిన కేసీఆర్..! బీఆర్ఎస్‌లో చేరాల్సిందిగా నేతలకు ఆహ్వానాలు..!

KCR Targets AP TDP : దేశ రాజకీయాల వైపు చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారా? గతంలో తనతో పని చేసిన టీడీపీ నేతలకు గాలం వేస్తున్నారా? అంటే, అవుననే సమాధానం టీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తోంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాలపై కేసీఆర్ స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో చేరాలంటూ ఏపీ టీడీపీ నేతలకు కేసీఆర్ నుంచి కబురు వెళ్లినట్లుగా సమాచారం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గత లోక్ సభ ఎన్నికల్లో ఏపీ నుంచి నుంచి పోటీ చేసి ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న నేతలతో మంతనాలు కూడా సాగుతున్నట్లుగా సమాచారం. ఈ విషయాలన్నీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో చిట్ చాట్ లో వెల్లడించారు. అటు ఇప్పటికే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తోనూ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అటు ఏపీని టార్గెట్ చేసి మంత్రి హరీశ్ రావు ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా ఇందులో భాగమే అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కేసీఆర్ నుంచి రానున్న కొత్త జాతీయ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని నగరాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోందన్న సంకేతాలు ఇస్తున్న తరుణంలో.. మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలోని టీడీపీ నేతలను సీఎం కేసీఆర్ టార్గెట్ చేశారని మంత్రి చెప్పడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మూడు జిల్లాలపై (శ్రీకాకుళం, విజయనగరం, కడప) కేసీఆర్ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు మంత్రి చెప్పారు. కొత్త పార్టీ బీఆర్ఎస్ కోసం ఏపీ టీడీపీ నేతలను గాలం వేస్తున్నట్లుగా ఆయన ప్రస్తావించారు. గతంలో తనతో కలిసి పని చేసిన నేతలను బీఆర్ఎస్ లోకి రావాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానించినట్లు సమాచారం.

జాతీయ పార్టీ ఏర్పాటు వైపుగా కేసీఆర్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. తాను స్థాపించబోయే జాతీయ పార్టీ పేరును దసరా రోజున ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ భవన్ లో దసరా రోజున (అక్టోబర్ 5) టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీ పేరు ప్రకటించనున్నారు. డిసెంబర్ 9న ఢిల్లీలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

మునుగోడులో అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో మన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. జాతీయ పార్టీ పేరుతోనే మునుగోడు ఎన్నికల బరిలో దిగుతామని స్పష్టం చేశారు.

కాగా.. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు కంటే.. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా(భారత రాష్ట్ర సమితి) మార్చడమే మేలనే నిర్ణయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చినట్లు సమాచారం. త్వరలో జరగబోతున్న మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ తరఫునే తమ అభ్యర్థిని కేసీఆర్ బరిలోకి దింపబోతున్నారు. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే దేశంలో పోటీ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారినప్పటికీ, పార్టీకి కారు గుర్తే ఉంటుందని, దాని వల్ల ప్రజల్లో ఇబ్బంది ఉండదని కేసీఆర్ చెప్పారట.

కొత్త పార్టీ ఏర్పాటు అంటే అనేక సమస్యలు వస్తాయని, దాని బదులు పార్టీ పేరు మారిస్తే సరిపోతుందని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. దసరా రోజు మంచి ముహూర్తం ఉండటంతో పార్టీ పేరును కేసీఆర్ ప్రకటించబోతున్నారు. దేశవ్యాప్తంగా రైతులు, యువత అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు, దేశంలో గుణాత్మక మార్పు కోసం.. కొత్త జాతీయ పార్టీ అవసరమని కేసీఆర్ చెప్పినట్లు టీఆర్ఎస్ నేతలు వివరించారు.