Telugu States Water Dispute : నీళ్ల పంచాయతీ, మంత్రుల మధ్య మాటల తూటాలు

తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ ముదురుతోంది. రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు దూసుకొస్తున్నాయి. కృష్ణా నదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడాన్ని విమర్శించారు ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్.

Telugu States Water Dispute : నీళ్ల పంచాయతీ, మంత్రుల మధ్య మాటల తూటాలు

Telugu States

AP & Telangana Water Issue : తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయితీ ముదురుతోంది. రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు దూసుకొస్తున్నాయి. కృష్ణా నదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడాన్ని విమర్శించారు ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్. కేటాయింపులకు లోబడే ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోందని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఏపీ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ అభ్యంతరాలు సరికాదన్నారు. కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నామన్నారు అనిల్.

తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారని ఆరోపించారు ఏపీ మంత్రి. కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారని ఆరోపించారు. రాజోలిబండ ప్రాజెక్ట్‌కి 4 టీఎంసీల కేటాయింపు ఉందన్నారు. 8 వందల 40 అడుగులకు లెవెల్ పడిపోతే ఏపీ చుక్కనీరు తీసుకునే అవకాశం లేదన్నారు మంత్రి అనిల్. జగన్ సీఎం అయ్యాక రెండు రాష్ట్రాలు కలిసుండాలి అని కోరుకున్నారని గుర్తు చేశారు.

ఏపీ మంత్రి అనిల్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కౌంటర్ ఇచ్చారు. స్నేహ హస్తం తాము అందిస్తే ..ఏపీ కయ్యానికి కాలు దువ్వుతుందన్నారు శ్రీనివాస్‌గౌడ్. ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం నోట్లో చక్కెర పోస్తూనే కడుపులో కత్తెర పెడుతుందని విమర్శించారు. నదికి పై భాగాన తెలంగాణ ఉందన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌…. తాము నీటిని తరలించుకోవాలంటే ఏమైనా చేయగలమన్నారు.