Anita Letter : జాతీయ మహిళా కమిషన్ కు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత లేఖ‍

అనారోగ్యంతో ఉన్న ఆరుద్ర కుమార్తెకు వైద్యం అందించే విషయంలో ఆమె ఇల్లును అమ్ముకోనీయకుండా కానిస్టేబుళ్లు అడ్డుకుంటున్నారన్న అంశాన్ని లేఖలో అనిత పేర్కొన్నారు.

Anita Letter : జాతీయ మహిళా కమిషన్ కు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత లేఖ‍

Anita Letter

National Women Commission : జాతీయ మహిళా కమిషన్ కు తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత లేఖ‍ రాశారు. కాకినాడలో ఆరుద్ర అనే మహిళను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని జాతీయ మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో ఉన్న ఆరుద్ర కుమార్తెకు వైద్యం అందించే విషయంలో ఆమె ఇల్లును అమ్ముకోనీయకుండా కానిస్టేబుళ్లు అడ్డుకుంటున్నారన్న అంశాన్ని లేఖలో అనిత పేర్కొన్నారు.

ఆరుద్ర విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అనిత పేర్కొన్నారు. న్యాయం చేయాలంటూ ఆందోళన చేస్తున్న ఆరుద్ర మానసిక స్థితి సరిగా లేదని, ఆస్పత్రికి పంపారని లేఖలో వెల్లడించారు.

Government Rice Mills : తెలంగాణలో ఇకనుంచి ప్రభుత్వ రైస్ మిల్లులు.. జిల్లాల వారిగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు

గతంలో ఇదే విధంగా డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా ముద్ర వేశారని లేఖలో అనిత ప్రస్తావించారు. ఇప్పుడు ఆరుద్రను పిచ్చిదానిగా ముద్ర వేస్తున్నారని అనిత పేర్కొన్నారు. ఆరుద్రకు న్యాయం చేసి.. ఆమె కుమార్తెకు ట్రీట్ మెంట్ అందేలా చూడాలని అనిత లేఖలో కోరారు.