MLC Elections Schedule : ఏపీ, తెలంగాణలో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్

ఏపీ, తెలంగాణలో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో నోటిఫికేషన్ విడుదల చేసింది.

MLC Elections Schedule : ఏపీ, తెలంగాణలో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్

MLC seats

MLC Elections schedule : ఏపీ, తెలంగాణలో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో ఏడు, తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి6న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి23న పోలింగ్ జరుగనుండగా అదే రోజు కౌంటింగ్ జరుగనుంది. నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 13గా సీఈసీ నిర్ణయించింది.

ఏపీలో నారా లోకేష్, చల్లా భగీరథ రెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పీవీవీ సూర్యనారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. తెలంగాణలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్ పదవీ కాలం ముగియనుంది. మరోవైపు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.

Vizag Global Investors Summit : విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు, ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష

మొత్తంగా 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. విత్ డ్రా గడువు ముగిసినా ఎవరూ ఉపసంహరించుకోలేదు. దీంతో మొత్తం 21 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మార్చి13న ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగనుంది. మార్చి 16న ఫలితం వెలువడనుంది.