Vizag Global Investors Summit : విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు, ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష

విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష జరిపారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్‌లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు జరగనుంది. పారిశ్రామిక రంగానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, సానుకూలతలను ఈ సదస్సు వేదికగా ప్రభుత్వం వివరించనుంది.

Vizag Global Investors Summit : విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు, ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష

Vizag Global Investors Summit : విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష జరిపారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్‌లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు జరగనుంది. పారిశ్రామిక రంగానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, సానుకూలతలను ఈ సదస్సు వేదికగా ప్రభుత్వం వివరించనుంది. తద్వారా పెట్టుబడుల ఆకర్షణకు ఈ సదస్సును వేదిక చేసుకోనుంది. కార్యక్రమాల షెడ్యూల్‌ను సీఎంకు వివరించిన అధికారులు.

Also Read..AP CM YS Jagan: విశాఖ రాజధానిపై గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు ..

వేదిక వద్ద జరుగుతున్న పనులు తదితర అంశాలను వివరించారు. ఈ సదస్సుకు వస్తున్న కేంద్రమంత్రులు, వ్యాపారవేత్తలు తదితరుల వివరాలను సీఎంకు తెలియజేశాన అధికారులు. సదస్సు నిర్వహణలో కొన్ని సూచనలు చేశారు ముఖ్యమంత్రి జగన్. ఉదయం అల్పాహారంతో తొలిరోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది.

”10 గంటల ప్రాంతంలో సదస్సు ప్రారంభం కానుంది. కీలక అంశాలపై సదస్సునుద్దేశించి పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపారవేత్తలు మాట్లాడనున్నారు. తర్వాత కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోనుంది ప్రభుత్వం. దీని తర్వాత వివిధ పారిశ్రామిక రంగాలపై సెషన్లు ఉంటాయి. వ్యాపారవేత్తలతో ముఖాముఖి చర్చలు జరపనున్నారు సీఎం జగన్. సదస్సు ప్రాంగణంలో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయనున్నారు. తొలి రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. తొలి రోజు రాత్రి సభకు హాజరైన వారికి విందు ఏర్పాటు చేశారు. ఆ విందులో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు.

Also Read..Andhra pradesh Three Capital : డౌటే లేదు..వైసీపీ విధానం మూడు రాజధానులే..ఇది పక్కా.. : అంబటి రాంబాబు

రెండో రోజున వాలెడిక్టరీ సెషన్‌ ఉంది. ఈ సెషన్ లో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. రెండో రోజున పలు కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోనుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని మొత్తంగా షెడ్యూల్‌ ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.