Andhra pradesh Three Capital : డౌటే లేదు..వైసీపీ విధానం మూడు రాజధానులే..ఇది పక్కా.. : అంబటి రాంబాబు

మూడు రాజధానుల విధానం గురించి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఎటువంటి సందేహం లేదని మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని అసలు వైసీపీ విధానమే అది అంటూ అంబటి వ్యాఖ్యానించారు. మూడు రాజధానులపై సందేహం అవసరం లేదు…వైసీపీ విధానం మూడు రాజధానులేనని..అన్నారు.

Andhra pradesh Three Capital : డౌటే లేదు..వైసీపీ విధానం మూడు రాజధానులే..ఇది పక్కా.. : అంబటి రాంబాబు

Ambati Rambabu once again sensational commentgs on three capital

andhra pradesh three capital : మూడు రాజధానుల విధానం గురించి మంత్రి అంబటి రాంబాబు మరోసారి దుమారం రేపారు. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఎటువంటి సందేహం లేదని మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని అసలు వైసీపీ విధానమే అది అంటూ అంబటి వ్యాఖ్యానించారు. మూడు రాజధానులపై సందేహం అవసరం లేదు…వైసీపీ విధానం మూడు రాజధానులేనని..రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్ధానిక భావాలున్నాయని..వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు అని తెలిపారు.

మూడు రాజధానుల విషయంలో ఏపీలో హీట్ కొనసాగుతున్న క్రమంలో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అంబటి మరోసారి రాజధానుల గురించి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. మూడు రాజధానుల విషయంలో ఏపీ హైకోర్టు వ్యతిరేకించినా..సుప్రీంకోర్టులో ఈ కేసు కొనసాగుతున్నా వైసీపీ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా ఉంది. పదే పదే మూడు రాజధానుల విషయం ప్రస్తావిస్తూ పాలనా వైఫల్యాలను కల్పిపుచ్చుకుంటోంది అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అభివద్ధి అనే మాటలకు అర్థమే తెలియని వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానులు అంటూ పదే పదే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మనోభావాలతో ముఖ్యంగా అమరాతికి భూములిచ్చినవారి మనోభావాలతో ఆడుకుంటోంది అంటూ విమర్శిస్తున్నారు విపక్ష నేతలు.

కొన్ని రోజుల క్రితం ఢిల్లీ వేదికగా సీఎం జగన్ కూడా త్వరలో విశాఖ రాజధానిగా మరనుంది అని తాను కూడా నివాసాన్ని విశాఖకు మార్చుకుంటున్నానంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని తేల్చి చెప్పింది. అయినా మరోసారి వైసీపీ నేతలు మూడు రాజధానుల మంత్రాన్ని మాత్రం జపించటం మానటంలేదు. న్యాయస్థానాల తీర్పుల్ని గౌరవించకుండా..కేంద్రం చెప్పిన వ్యాఖ్యల్ని బేఖాతరు చేస్తూ వైసీపీ నేతలు చేసే ఈ వ్యాఖ్యలు పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవటానికేనంటున్నాయి విపక్షాలు.ఈక్రమంలో ఏటువంటి డౌట్ లేదు వైసీపీ విధానం మూడు రాజధానులే అంటూ మంత్రి అంబటి రాంబాలు చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ఏపీలో దుమారం రేపనున్నాయనిపిస్తోంది.

మూడు రాజధానుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు చేశారు. వారాహి ఏది?.. ఎక్కడ..? ఆ సినిమా ఆపారా? అంటూ ఎద్దేవ చేస్తూ ప్రశ్నించారు. అలాగే లారాలోకేశ్ పై విమర్శలు చేస్తూ..లోకేశ్ కు తెలుగు భాష మాట్లాడటం కూడా సరిగా రాదన్నారు.తెలుగు మాట్లాడలేనివారు టీడీపీ వారసుడా? అంటూ ప్రశ్నించారు.ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు చెప్పిన ఖర్మ అని ఏద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుంది అంటూ విమర్శలు సంధించారు.