Cyclone : మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకనున్న వాయుగుండం..నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. మరికొన్ని గంటల్లో వాయుగుండం తీరాన్ని తాకనుంది. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Cyclone : మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకనున్న వాయుగుండం..నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

Cyclone

Heavy rains across Nellore : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. మరికొన్ని గంటల్లో వాయుగుండం తీరాన్ని తాకనుంది. చెన్నైకి సమీపంలో వాయుగుండం కదులుతోంది. వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, తడ, దొరవారి సత్రం, నాయుడుపేటలో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నాలుగు మండలాల్లో 2850 ఎకరాల్లో వరి నాట్లు నీట మునిగాయి.

తడలోని అపార్ట్ మెంట్స్ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. నెల్లూరులో రమేష్ రెడ్డి నగర్, కలెక్టరేట్ సమీపంలో చెట్లు కూలిపడ్డాయి. దీంతో పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

TSRTC Charges : ఓ ట్విటర్‌ పోస్టు.. ఆర్టీసీ చార్జీలు తగ్గించింది

భారీ వర్షాలపై ఎప్పటికప్పుడు అధికారులతో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సమీక్షిస్తున్నారు. పలు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. శ్రీకాళహస్తిలోని కాళoగి డ్యామ్ నుంచి కాళoగి నదికి భారీగా వరద నీరు చేరుకుంది.