Badwel By-Election : బద్వేల్ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు నేడు చివరి గడువు

బద్వేల్‌ ఉప ఎన్నికకు ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. ఉదయం 11 గంటల నుండి మ.3 గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Badwel By-Election : బద్వేల్ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు నేడు చివరి గడువు

Badwel

The deadline for filing nominations : ఏపీలోని కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికకు ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. నామినేషన్ల దాఖలకు నేటితో గడువు ముగియనుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

బీజేపీ అభ్యర్థిగా పుంతల సురేశ్‌ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధ, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 13 వరకు అవకాశం ఉంది. ఈ నెల 30న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Huzurabad By-Election : హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లకు నేటితో ముగియనున్న గడువు

భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయడానికి వైసీపీ సన్నాహాలు చేసుకుంటున్నాయి. వైసీపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పలువురు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.

రాష్ట్ర నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి బీజేపీ సన్నద్ధం అవుతోంది. బీజేపీ అభ్యర్థి సురేష్ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పలువురు పార్టీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఒక సెట్ నామినేషన్ వేశారు.