Visakhapatnam ODI: విశాఖ వన్డేకు పొంచి ఉన్న వర్షం ముప్పు.. 19న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్

కోస్తాంధ్రలో గురువారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 18, 19 తేదీల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది.

Visakhapatnam ODI: విశాఖ వన్డేకు పొంచి ఉన్న వర్షం ముప్పు.. 19న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్

Visakhapatnam ODI: ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య విశాఖపట్నంలో జరగనున్న రెండో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. కోస్తాంధ్రలో గురువారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 18, 19 తేదీల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు.. ఈ నెల 20న విచారణకు హాజరు కావాలని ఆదేశం

ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. ఈ నెల 17, శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరుగుతుంది. ఆ తర్వాత రెండో వన్డే 19, ఆదివారం రోజు విశాఖపట్నంలో జరపాలని నిర్ణయించారు. ఈ మ్యాచ్ కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టిక్కెట్ల విక్రయం కూడా పూర్తైంది. అయితే, మ్యాచ్ జరిగే రోజు విశాఖలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పటికే కోస్తాలో ఈ రోజు నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌ నుంచి జార్ఖండ్‌ మీదుగా దక్షిణ ఒడిశా వరకు, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ వరకు ద్రోణులు కొనసాగుతున్నాయి.

దీంతో వర్షం ప్రభావంతో మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువే ఉన్నాయి. మరోవైపు అకాల వర్షాలతో కోస్తా రైతులకు తీరని నష్టం కలిగే అవకాశం ఉంది. కోస్తా ప్రాంతం, దానికి ఆనుకుని ఒడిశాలో ఆకాశం మేఘావృతమై ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేకచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చు. గంటకు 40 నుంచి 50 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.