Secretariat Employees: ఏపీ ఆర్థికశాఖ సమాచారం లీకేజీ.. ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఆర్థికశాఖలో పనిచేస్తున్న​ ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

Secretariat Employees: ఏపీ ఆర్థికశాఖ సమాచారం లీకేజీ.. ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు

Ap

Secretariat Employees: ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్మెంట్‌లో సమాచారం లీకేజ్ పై ఏపీ ప్రభుత్వం పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు 11 మందిపై ప్రభుత్వం వేటు వేసింది. మరి కొంతమందిని కూడా బాధ్యులను చేసే అవకాశం ఉండటంతో ఫైనాన్స్ డిపార్మెంట్‌తో పాటు CSMFలో పనిచేస్తున్న ఉద్యోగులు హడలిపోతున్నారు. వేటుపడిన పదకొండు మందిలో ముగ్గురు సచివాలయంలో పనిచేస్తున్న ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులు ఉన్నారు. మిగిలిన 8 మంది CSMF ఉద్యోగులు. సచివాలయం ఆర్థిక శాఖలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.

ఇందులో ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు.. ఒకరు అసిస్టెంట్ సెక్రెటరి. ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్లుగా పని చేస్తున్న డి. శ్రీనుబాబు, కే. వర ప్రసాద్‌, అసిస్టెంట్ సెక్రెటరీ నాగులపాటి వెంకటేశ్వర్లును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ సమాచారం లీక్ చేస్తున్నారని వీరిపై అభియోగాన్ని ప్రభుత్వం మోపింది. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌ ఆఫీసు విడిచి వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. అంతేకాక కాంప్రహెన్సివ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టంలో పనిచేస్తున్న మరో ఎనిమిది మందిపై కూడా ప్రభుత్వం వేటు వేసింది. CSMFలో పనిచేసే ఐదుగురు ప్రైవేటు ఉద్యోగులను తొలగించారు. ముగ్గురు ట్రెజరీస్ నుండి వచ్చిన ఉద్యోగులను మాతృసంస్థకు పంపిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ వ్యవహారానికి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కాంట్రాక్ట్ చెల్లిపులు 3 వేల కోట్ల రూపాయలు చెల్లించలేకపోయారు. 2021 మార్చి 31న ఈ బిల్లులను ఆర్థిక శాఖ ఆర్బిఐకి పంపింది. అప్పటికే ఆర్బిఐ క్యూలో అనేక ఫైళ్లు ఉండటంతో ఫైనాన్సియల్ ఇయర్ ముగిసే నాటికి పరిశీలించలేకపోయింది. దీంతో ఆ ఫైల్ వెనక్కి రావడంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే ఈ బిల్లులను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌ ఈ బిల్లులను సస్పెన్స్ అకౌంట్‌లోకి మూవ్ చేసింది. ఈ సమాచారం ఎలా బయటకు లీక్ అయిందన్న అంశంపై ప్రభుత్వం దర్యాప్తు మొదలు పెట్టింది. ఏప్రిల్ 2న సమావేశంలో పాల్గొన్న వారే ఈ ఫైల్‌కు సంబంధించిన సమాచారం లీక్ చేసి ఉంటారని అధికారులు అనుమానించారు. ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులను విచారిస్తున్నట్టు సమాచారం.