TIGER: ఇరవై రోజులైనా దొరకని పులి జాడ

తాజాగా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామ పరిసరాల్లో పులి అడుగుజాడలను అధికారులు గుర్తించారు. అయితే, పులి అటవీ ప్రాంతం వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేయగా, మళ్లీ యూ టర్న్ తీసుకుని ఏలేశ్వరం మండలం నుంచి వెనక్కి వచ్చింది.

TIGER: ఇరవై రోజులైనా దొరకని పులి జాడ

Tiger

TIGER: కాకినాడ జిల్లాలో ప్రజలు, అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్న పులి ఇరవై రోజులైనా ఇంకా చిక్కలేదు. పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్న అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ తప్పించుకు తిరుగుతోంది. తాజాగా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామ పరిసరాల్లో పులి అడుగుజాడలను అధికారులు గుర్తించారు. అయితే, పులి అటవీ ప్రాంతం వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేయగా, మళ్లీ యూ టర్న్ తీసుకుని ఏలేశ్వరం మండలం నుంచి వెనక్కి వచ్చింది. ప్రత్తిపాడు మండలంలో సుమారు 12 కిలోమీటర్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Jubilee Hills Rape Case: పోలీసు కస్టడీకి ఏ1 నిందితుడు.. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌కు ఏర్పాట్లు
ప్రకాశం జిల్లాలో
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం, పెద్ద బొమ్మలాపురం గండి చెరువు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు సమాచారం. మూడు రోజుల నుంచి చెరువు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి.. వ్యవసాయ పనులు చేసుకుంటున్న కొందరు రైతులకు కనిపించింది. అటవీ శాఖాధికారులు స్పందించి నిఘా ఏర్పాటు చేసి, పెద్దపులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామస్థుల ఆందోళనతో అటవీ శాఖాధికారులు స్పందించారు. బొమ్మలపల్లి పరిసర పొలాల్లో గత 15 రోజుల క్రితం పులి అడుగుజాడలను గుర్తించారు. వాటి ముద్రలను మార్క్ చేశారు.

Credit Cards: క్రెడిట్ కార్డులతో యూపీఐ పేమెంట్లకు ఆర్‌బీఐ అనుమతి

నలుగురు ఫారెస్ట్ అధికారులతో స్థానికంగా గస్తీ ఏర్పాటు చేశారు. అటవీప్రాంతం గ్రామ పొలాలకు దగ్గరగా ఉండటం, గండికోట చెరువు ప్రాంతం అటవీ ప్రాంతం పరిధిలో ఉండటంతో పులి సంచరించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పులి కదలికల గురించి సమాచారం అందితే తగిన చర్యలు తీసుకుని పులిని పట్టుకుంటామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విశ్వేశ్వరయ్య చెప్పారు. అయితే, గ్రామస్తులు మాత్రం పులికదలికలతో ఆందోళనకు గురవుతున్నారు. పొలాల్లో పని చేసేందుకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.