Tomato prices: టమాటా ధరలు రెండు వారాల్లో తగ్గొచ్చు: కేంద్రం

దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ధరలు రెండు వారాల్లోగా తగ్గే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. టమాటా ధరల పెరుగుదల అంశంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ దృష్టి సారించింది.

Tomato prices: టమాటా ధరలు రెండు వారాల్లో తగ్గొచ్చు: కేంద్రం

Tomato Prices

Updated On : June 2, 2022 / 7:45 PM IST

Tomato prices: దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ధరలు రెండు వారాల్లోగా తగ్గే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. టమాటా ధరల పెరుగుదల అంశంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ దృష్టి సారించింది. కేంద్ర శాఖ
సేకరించిన డాటా ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో రెండు వారాల్లో టమాటా ధరలు అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిన సంగతి
తెలిసిందే. అనేక రాష్ట్రాల్లో కేజీ టమాటా ధర 50 రూపాయల నుంచి 106 రూపాయల వరకు పలుకుతోంది.

AnteSundaraniki: థియేటర్లో నవ్వులు ఖాయం అంటున్న ‘అంటే సుందరానికీ’ ట్రైలర్

అకాల వర్షాలు, వాతావరణం వల్ల టమాటా పంటకు తీవ్ర నష్టం కలిగింది. దీంతో దిగుబడి తగ్గి, రేట్లు పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ టమాటా సగటున రూ.40, కోల్‌కతా, ముంబైలలో 77, చెన్నైలో 60గా ఉంది. ఢిల్లీలో టమాటా ధర స్థిరంగా ఉన్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉందని, రెండు వారాల్లో తగ్గుతాయని సుధాన్షు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై రాష్ట్రాలతో కూడా మాట్లాడుతున్నట్లు చెప్పారు. మరోవైపు ఉల్లి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయని, లక్ష్యానికి అనుగుణంగానే ఉల్లి దిగుబడి ఉందన్నారు. ఇప్పటికే 52,000 టన్నుల ఉల్లి సేకరించామని చెప్పారు. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ సేకరించినట్లు తెలిపారు.