AnteSundaraniki: థియేటర్లో నవ్వులు ఖాయం అంటున్న ‘అంటే సుందరానికీ’ ట్రైలర్

నాని, నజ్రియా జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ గురువారం సాయంత్రం విడుదలైంది. విశాఖపట్నంలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఈ ట్రైలర్ లాంఛ్ చేశారు.

AnteSundaraniki: థియేటర్లో నవ్వులు ఖాయం అంటున్న ‘అంటే సుందరానికీ’ ట్రైలర్

Antesundaraniki

AnteSundaraniki: నాని, నజ్రియా జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ట్రైలర్ గురువారం సాయంత్రం విడుదలైంది. విశాఖపట్నంలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఈ ట్రైలర్ లాంఛ్ చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకునేలా ఉండగా, తాజాగా విడుదలైన ట్రైలర్ చిత్రంపై అంచనాలను మరింత పెంచేసింది. ముఖ్యంగా కామెడీతో ఆకట్టుకుంది. యూత్‌ను, ఫ్యామిలీని ఆకట్టుకునే అంశాలతో, కామెడీ సన్నివేశాలతో ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. ఈ నెల 10న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచడం ఖాయం అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే. గత చిత్రాలకు భిన్నంగా నాని ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నారు.

Punjab: సిద్ధూ హత్యతో దిగొచ్చిన ఆప్ సర్కారు.. వీవీఐపీలకు భద్రత కొనసాగింపు

నాని-నజ్రియా జంట కూడా తెరపై ఫ్రెష్‌గా అనిపిస్తోంది. హిందూ అబ్బాయి-క్రిస్టియన్ అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందింది. అమెరికాలో చిత్రీకరించిన సన్నివేశాలు కూడా ఆకర్షణగా నిలుస్తున్నాయి. సీనియర్ నటుడు నరేష్, హర్షవర్ధన్, రోహిణి, నదియ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీత దర్శకుడు.