TTD Calendar : ఆరు పేజీల ప్రత్యేక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్, ధర రూ.450
అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యక్షంగా వీక్షించిన, తాకిన అనుభూతి కలిగేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్యాలెండర్లను ముద్రించినట్టు టీటీడీచైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు

TTD Calendar : శ్రీవారు, అమ్మవార్ల చిత్రాలకు 3డీ ఎఫెక్ట్, సిల్వర్ కోటింగ్‌తో ప్రత్యేకంగా రూపొందించిన 6 పేజీల క్యాలెండర్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది.
Whatsapp 3 Tick : వాట్సాప్‌లో మూడో బ్లూ టిక్.. ఆ వార్త ఫేక్..!
అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యక్షంగా వీక్షించిన, తాకిన అనుభూతి కలిగేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్యాలెండర్లను ముద్రించినట్టు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. ఒక్కో పేజీలో రెండు నెలలకు సంబంధించిన వివరాలు ఉండేలా రూపొందించారని తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రగతి ప్రింటర్స్ సంస్థ వీటిని ముద్రించిందని వివరించారు. మొత్తం 25 వేల కాపీలు ముద్రించామని, ఒక్కో క్యాలెండర్ ధర రూ.450 అని వెల్లడించారు. తిరుమల, తిరుపతితోపాటు విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో భక్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచామన్నారు.
Tamarind Nuts : చింత గింజలతో ఆరోగ్య చింతలు దూరం
అనంతరం టీటీడీ కార్పొరేషన్‌లో చేరిన ఉద్యోగుల గుర్తింపు కార్డులను కార్పొరేషన్ సీఈవో శైలేంద్ర.. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి చూపించారు. ఇటీవల వెయ్యి మందికిపైగా కార్పొరేషన్‌లో చేరారని, వారికి కల్పించే సదుపాయాల గురించి ఆయన చైర్మన్‌కు వివరించారు.