Dharma Reddy: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ ఏర్పాట్లన్నీ చేశాం.. భక్తులు ఇలా సేవలు వినియోగించుకోవాలి

తిరుమల-తిరుపతి మధ్య ప్రతిరోజు ఆర్టీసీ బస్సులు 2000 ట్రిప్పులు తిరుగుతాయని చెప్పారు.

Dharma Reddy: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ ఏర్పాట్లన్నీ చేశాం.. భక్తులు ఇలా సేవలు వినియోగించుకోవాలి

TTD

Updated On : September 16, 2023 / 6:24 PM IST

Dharma Reddy – Brahmotsavam: తిరుమల తిరుపతి (Tirupati) శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశామని 10టీవీకి టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈనెల 18న ధ్వజారోహణం రోజు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు.

తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు ప్రతిరోజు 25 వేలు జారీ చేస్తామని తెలిపారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్ ద్వారా ఇప్పటికే రోజుకు 15 వేల చొప్పున జారీ చేశామని చెప్పారు. టోకెన్ లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా నేరుగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.

నిత్యాన్నదానం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లతో పాటు రద్దీగా ఉండే ఇతర ప్రాంతాల్లో కూడా అన్న ప్రసాదాల వితరణ ఉంటుందన్నారు. తలనీలాలు సమర్పించే భక్తులకు ఆలస్యం కాకుండా 1200 మంది క్షురకుకు 24 గంటలు పాటు సేవలందిస్తారని తెలిపారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో సుమారు 2 లక్షల మంది భక్తులు కూర్చోవడానికి అవకాశం ఉంటుందని వివరించారు.

గరుడ సేవ రోజు అదనంగా వచ్చే భక్తులకు మాడవీధుల్లోని ఐదు పాయింట్ల ద్వారా లోపలికి తీసుకొని గరుడ వాహన దర్శనం చేయిస్తామని తెలిపారు. తిరుమల తిరుపతి మధ్య ప్రతిరోజు ఆర్టీసీ బస్సులు 2000 ట్రిప్పులు తిరుగుతాయని చెప్పారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల భద్రత కోసం 3500 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బంది సేవలందిస్తారని తెలిపారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఫోటో ఎగ్జిబిషన్, పుష్ప ప్రదర్శనశాల ఏర్పాటు చేశామని అన్నారు. స్వామివారి వాహన సేవలు ఉదయం 8 నుండి 10 గంటల వరకు రాత్రి 7 నుండి 10 గంటల వరకు జరుగుతాయని అన్నారు.

Pawan Kalyan Varahi Yatra : 4వ విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ .. డేట్ ఫిక్స్