పోలవరంపై కాంప్రమైజ్ అయితే..జగన్ కు పతనమే – ఉండవల్లి

  • Published By: madhu ,Published On : October 29, 2020 / 02:07 PM IST
పోలవరంపై కాంప్రమైజ్ అయితే..జగన్ కు పతనమే – ఉండవల్లి

Undavalli Arun Kumar Press Meet Over Polavaram Project : పోలవరం ప్రాజెక్టుపై కాంప్రమైజ్ అయితే..సీఎం జగన్ కు పతనమేనన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయడం లేదని ప్రశ్నించారు. అఫిడవిట్ వేస్తే ఏం నష్టమన్నారు. కేసులు కాపాడుకోవడం కోసం రాష్ట్రాన్ని అన్యాయం చేస్తే ఎవరూ ఊరుకోరన్నారు.




పార్లమెంట్, అసెంబ్లీలో జరిగిన అంశాలపై కోర్టులు ప్రశ్నించవన్నారు. పోలవరానికి 100 శాతం నిధులు కేంద్రమే భరిస్తుందని విభజన చట్టంలో చెప్పారని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును పక్కన పెడితే..ఏమి అనకుండా ఉంటామా అని నిలదీశారు. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆర్థిక పరిస్థితి పెరగాలంటే..పోలవరం ప్రాజెక్టును బిల్లులో పెట్టారని, జాతీయ ప్రాజెక్టు అని చెప్పారన్నారు. వెంకయ్య నాయుడిది మెయిన్ పాత్ర ఉందన్న ఆయన…ప్రధాన మంత్రి వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారన్నారు. దీనికి సంబంధించిన మార్పులు అవసరం ఉంటే చేస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని..ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆనాడు ప్రధాన మంత్రిగా ఉన్న మన్మోహన్ చెప్పారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.




కానీ..ప్రస్తుతం ఏ ఒక్కటి అమలు కావడం లేదని, ప్రత్యేక హోదా పక్కన పెట్టేశారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత…పోలవరం ప్రాజెక్టు అథార్టీ పెట్టి..దానికి అప్పచెబుతూ..మే 28వ తేదీన తీర్మానం చేశారని తెలిపారు. ఆరు మండలాలను వెంటనే చేర్చాలని వెల్లడిస్తూ..పార్లమెంట్ సమావేశం అవ్వకుండా..అప్పటికప్పుడు ఆర్డినెన్స్ తెచ్చారని, పోలవరం అథార్టీ నియమించిన తర్వాత..ఆరు మీటింగ్స్ జరిగాయన్నారు.

ప్రతి మీటింగ్ లో అడగడం..వీరు నో చెప్పడం జరిగిందన్నారు. 2013-14 రేట్లు ఏవైతో ఉన్నాయో..అవే ఇస్తామని, కేబినెట్ తీర్మానం చేశామని రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జైట్లీ చెప్పారన్నారు. ఆనాడు వెంటనే బాబు ప్రెస్ మీట్ పెట్టారన్నారు. గతంలో టీడీపీ ఎంపీలతో తాను సమావేశమై..నోటీసు ఇవ్వాలని కోరినా..ఇవ్వలేదన్నారు.




2014 ఉన్న రేట్లు 2018లో ఉంటాయా అని సూటిగా ప్రశ్నించారు. బాబు ప్రభుత్వం అఫిడవిట్ వేయలేదని, పోలవరం కట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వందేనని గతంలో జగన్ చెప్పారన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు పలు గైడ్ లైన్స్ ఇచ్చిందన్నారు. రాజశేఖరరెడ్డి సంకల్పించిన ప్రాజెక్టు అని, ఆయన పేరు పెట్టాలని తాము డిమాండ్ చేశామన్నారు.
వెంకయ్య నాయుడు ఏం చెప్పారంటే…

‘రూ. 47 వేల 937 కోట్ల ఆదాయం ఉందని, రూ. 47 వేల 253 కోట్ల ఖర్చు ఉందని, రూ. 674 కోట్ల ఆదాయం మిగుల్లో ఉంది. తెలంగాణలో (రాయలసీమ మైనస్ రూ. 7 వేల 05 కోట్లు), తెలంగాణలో హైదరాబాద్ తీసేస్తే…రూ. 8 వేల 400 కోట్ల మైనస్ లో ఉంది. హైదరాబాద్ కలిపితే..రూ. 12 వేల 854 కోట్లు ప్లస్ లో వస్తుంది’. వెంటనే రూ. 10 వేల కోట్లు ఇవ్వాలని వెంకయ్య డిమాండ్ చేశారన్నారు. తాము అధికారంలోకి వస్తే..రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారన్నారు.




2018, జనవరిలో రూ. 57 వేల 297.42 కోట్లు ఉంటే..పోలవరం పూర్తవుతుందని బాబు ప్రభుత్వం పంపించిందని, రూ. 17 వందల కోట్లు ఎక్కువ వేశారని పేర్కొంటూ…రూ. 55 వేల 548.87 లక్షలను ఆమోదించడం జరిగిందని మంత్రి రతన్ లాల్ ఖటారియా సమాధానం చెప్పారన్నారు. రివర్సింగ్ టెండరింగ్ తీసుకొచ్చి రూ. 700 కోట్లు మిగిలాయని వైసీపీ ప్రభుత్వం చెప్పిందన్నారు. అప్పుడున్న ధైర్యం జగన్ లో ఏమైందని నిలదీశారు. తాను పిటిషన్ వేస్తున్నట్లు, పిటిషన్ వేయడానికి ఎంతో సమయం పట్టదని, అఫిడవిట్ వేయకపోవడం వల్ల సరెండర్ అయిపోయారా అని ప్రశ్నించారు ఉండవల్లి.