Carl Vinson : విశాఖ తీరానికి యూఎస్ఎస్ కార్ల్ విన్సన్

కార్ల విల్సన్ నౌక బరువు 1,13,500 టన్నులు ఉంటుంది. పొడవు 1,092 అడుగులుగాను, వెడల్పు 252 అడుగులు గాను ఉంది. గంటకు 56కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

Carl Vinson : విశాఖ తీరానికి యూఎస్ఎస్ కార్ల్ విన్సన్

Carl Vilsan

Carl Vinson : బంగాళాఖాతంలో జరుగుతున్న మలబార్ ఫేజ్ 2విన్యాసాల్లో పాల్గొనేందుకు అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌక విశాఖ తీరానికి చేరుకుంది. అమెరికాకు చెందిన యూఎస్ ఎస్ కార్ల్ విన్సన్ గా పిలవబడే ఈ విమాన వాహక అణు యుద్దనౌక ఎంతో ప్రాధాన్యత కలిగింది. అమెరికా తన నౌకాదళంలో దీనిని 1980లలో ప్రవేశ పెట్టింది.

అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఈ కార్ల మిన్సన్ యుద్ద వాహక నౌకకు జార్జియాకు చెందిన ప్రముఖ నేత కార్ల్ విన్సన్ అమెరికా నౌకాదళానికి సేవలకు గుర్తింపుగా ఆయన పేరు పెట్టారు. 1983 నుండి అమెరికా నౌకాదళంలో సేవలందిస్తున్న ఈ యుద్ద నౌక సాధారణ విమాన వాహక యుద్ధ నౌకలకంటే భిన్నంగా ఉంటుంది.

కార్ల విల్సన్ నౌక బరువు 1,13,500 టన్నులు ఉంటుంది. పొడవు 1,092 అడుగులుగాను, వెడల్పు 252 అడుగులు గాను ఉంది. గంటకు 56కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో మొత్తం 6,012 మంది సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తిస్తుంటారు. యుద్ధనౌక లక్ష్యంగా సంధించే క్షిపణులు, టోర్పెడోలను క్షణాల్లో గుర్తించే అత్యాధునిక మైన వ్యవస్ధలు ఈ నౌక సొంతమని చెప్పాలి. శత్రువులపై మెరుపువేగంతో దాడి చేయగల శక్తివంతమైన యుద్ద విమానాలు, హెలికాప్టర్లు ఈ వాహక యుద్ద నౌక కలిగి ఉంటుంది.

ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ హతమైన తరువాత అతని మృతదేహాన్ని ఇదే యుద్ధనౌక ద్వారా సముద్రం మద్యకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇరాక్ యుద్ధంతోపాటు, డిసర్ట్ స్ట్రైక్, సదరన్ వాచ్, ఎండ్యూరింగ్ ఫ్రీడం వంటి ఆపరేషన్లలో సైతం క్రియాశీలక పాత్ర పోషించింది.