Tirumala : జనవరి 13,14 తేదీల్లో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలు

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి13,14తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలు నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో జనవరి11 నుండి 14 వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ ను టీటీడీ రద్దు చేసింది.

Tirumala : జనవరి 13,14 తేదీల్లో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలు

Thirumala

Vaikuntha Ekadashi and Dwadashi celebrations in Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 13, 14 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి వేడుకలు నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో జనవరి 11 నుండి 14 వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ ను టీటీడీ రద్దు చేసింది. సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా జనవరి 11 నుండి 14 వరకు కరెంట్ బుకింగ్ ద్వారానే గదుల కేటాయింపు ఉంటుందని తెలిపింది.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా 825 గ్రాములు బ‌రువుగ‌ల కెంపులు,పచ్చలు, నీలము, ముత్యాలు పొదిగిన బంగారు పతకము, రెండు బాజీ బందులు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి కానుక‌గా స‌మ‌ర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

Road Accident : కేరళలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి

ముందుగా శ్రీవారి ఆలయంలో తెల్లావారుఝూమున గం.2.30 నుండి పరిమళాన్ని(నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమం) విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌ట్టారు. అనంత‌రం శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వ‌హించారు.

ఆ త‌రువాత తెల్లవారుఝామున గం.4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. అక్క‌డి నుండి కోమ‌ల‌మ్మ స‌త్రం, తిరుచానూరు పసుపు మండపం మీదుగా ఆలయం వ‌ద్ద అమ్మ‌వారికి సారె స‌మ‌ర్పించారు.