vidadala rajini: బాధితురాలికి అండగా ఉంటాం: మంత్రి విడదల రజిని
గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళపై అత్యాచారం జరగటం అత్యంత బాధాకరం అన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని. రేపల్లె అత్యాచార ఘటనపై రజిని ఆదివారం మీడియాతో మాట్లాడారు.

Vidadala Rajini
vidadala rajini: గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్‌లో మహిళపై అత్యాచారం జరగటం అత్యంత బాధాకరం అన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని. రేపల్లె అత్యాచార ఘటనపై రజిని ఆదివారం మీడియాతో మాట్లాడారు. అత్యాచార ఘటనను సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారని, నిందితులకు కఠిన శిక్ష పడే వరకు ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు.
Guntur : ఆలయంలో నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం
పోలీసులు ఇప్పటికే ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని, ఈ అంశంపై జిల్లా ఎస్పీతో, ఆసుపత్రి అధికారులతో మాట్లాడానని చెప్పారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.