Guntur : ఆలయంలో నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం

దుగ్గిరాల మండలంలో మరో మహిళపై అత్యాచారయత్నం ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ కూలీ పనుల కోసం దుగ్గిరాలకు వచ్చింది.

Guntur : ఆలయంలో నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం

Guntur

Updated On : April 29, 2022 / 12:40 PM IST

Attempted rape of woman : గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గిరాలలో జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరువకముందే మరో మహిళపై అత్యాచారయత్నం జరిగింది. దుగ్గిరాల మండలంలో మరో మహిళపై అత్యాచారయత్నం ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ కూలీ పనుల కోసం దుగ్గిరాలకు వచ్చింది. అదే గ్రామంలోని ఆలయంలో ఆమె నిద్రిస్తోంది.

ఈనేపథ్యంలో బైక్ పై అటుగా వెళ్లిన యువకులు నిద్రిస్తున్న మహిళను బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఆమెపై అఘాయిత్యం చేయడానికి యత్నించారు. బాధిత మహిళ కేకలు వేయడంతో యువకులు పారిపోయారు. తోటి కూలీలు డయల్ 100 కు ఫోన్ చేసి యువకులపై ఫిర్యాదు చేశారు.

Gunturu : గుంటూరు జిల్లాలో మహిళ హత్య

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. యువకులు వాడిన బైక్ ను ఆలయ సమీపంలో గుర్తించారు. పోలీసులు బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. బైక్ నెంబర్ ఆధారంగా యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.