Vijayawada : రూ.50లక్షల సరుకు సీజ్ గొడవ.. విజయవాడలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు Vs రైల్వే అధికారులు

విజయవాడలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, రైల్వే అధికారులు గొడవకు దిగారు. రైల్వే స్టేషన్ లో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేసి రూ.50లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు.

Vijayawada : రూ.50లక్షల సరుకు సీజ్ గొడవ.. విజయవాడలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు Vs రైల్వే అధికారులు

Vijayawada : విజయవాడలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, రైల్వే అధికారులు గొడవకు దిగారు. రైల్వే స్టేషన్ లో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేసి రూ.50లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు. దీంతో అనుమతి లేకుండా ఎందుకు తనిఖీలు చేశారని కమర్షియల్ ట్యాక్స్ అధికారులను రైల్వే అధికారులు నిలదీశారు. దీంతో ఎక్కడి సరుకు అక్కడే పెట్టి వెనక్కి వెళ్లిపోయారు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఒకానొక సమయంలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులను రైల్వే అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం అనుమతులు లేకుండా సోదాలు ఎలా చేస్తారని నిలదీయడంతో ట్యాక్స్ ఆఫీసర్స్ వెనుదిరిగారు. సీజ్ చేసిన సరుకును రైల్వేస్టేషన్ లోనే వదిలి వెళ్లారు. కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, రైల్వే అధికారుల మధ్య గొడవ స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.