Gold Mafia : బెజవాడలో బంగారం చాలా చౌక…!

బెజవాడలో గత కొన్నేళ్లుగా రహస్యంగా సాగుతున్న గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది.  రూ.5 లక్షల బంగారం బిస్కట్ రూ.4లక్షలకే విక్రయిస్తోంది ఇక్కడి బంగారం స్మగ్లింగ్ మాఫియా. 

Gold Mafia : బెజవాడలో బంగారం చాలా చౌక…!

Vijawada Gold Smuggling

Gold Mafia : బెజవాడలో గత కొన్నేళ్లుగా రహస్యంగా సాగుతున్న గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది.  రూ.5 లక్షల బంగారం బిస్కట్ రూ.4లక్షలకే విక్రయిస్తోంది ఇక్కడి బంగారం స్మగ్లింగ్ మాఫియా.  బంగారం ….ఈ పేరు వింటేనే చాలు ఆడవాళ్లకు ప్రాణం లేచి వస్తుంది. శ్రావణమాసంఅనో. అక్షయ తృతీయ అనే, ఏదో ఒకపేరు చెప్పి బంగారం వ్యాపారస్తులు మహిళలను ఆకర్షిస్తూ ఉంటారు. అందుకతగ్గట్టు గానే దేశంలో బంగారం స్మగ్లింగ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నగోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం బయట పడింది. ఇందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఎలా బయటపడిందంటే…
బంగారం బిస్కట్ ఇస్తానని నాలుగు నెలల క్రితం డబ్బులు తీసుకుని ఇప్పటిదాకా బిస్కెట్ లు ఇవ్వక పోవటంతో మూడురోజుల క్రితం గోల్డ్ మాఫియాకు చెందిన పీఎస్ నాగమణి అనే మహిళతో కొందరు వాగ్వాదానికి దిగారు. ఈవాగ్వాదాన్ని కిడ్నాప్ గా చిత్రీకరించి నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసుకున్నపోలీసులు ఇద్దరు వ్యక్తులను పిలిచి విచారించటంతో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగు చూసింది.

గోల్డ్ స్మగ్లింగ్ లో నాగమణితో పాటు విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి, రైల్వే స్క్వాడ్ క చెందిన ఆకుల వెంకట రాఘవేంద్రరావులను టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

ఈ ముఠా 2018 నుంచి బంగారాన్ని అనధికారికంగా విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. 100 గ్రాముల బంగారం బిస్కెట్‌లను వాయు, జల మార్గాల ద్వారా నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.5 లక్షల ఖరీదు చేసే బిస్కెట్‌ను వీరు రూ.4 లక్షలకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు బంగారం లభించడంతో వీరి వ్యాపారం జోరందుకుంది. దీంతో పలువురు బంగారం కోసం వీరికి నగదు చెల్లించారు.

నగదు చెల్లించిన 20 నుంచి 30 రోజుల వ్యవధిలో వీరు  బంగారం బిస్కెట్‌లను  కస్టమర్లకు అందిస్తారని సమాచారం. బంగారం ఉత్పత్తి కేంద్రమైన సౌదీలోని ఖతర్‌ నుంచే స్మగ్లింగ్‌ ముఠా బంగారాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్‌ నుంచి సింగపూర్‌కు, అక్కడ నుంచి విజయవాడకు వాయు, జలమార్గాల ద్వారా బంగారం బిస్కెట్‌లు తీసుకొస్తున్నట్లు సమాచారం.

Read Also :  Whats App Hacking : తల్లి వాట్సప్ హ్యాక్ చేసి, ఆమె ప్రియుడ్నిబ్లాక్ మెయిల్ చేసి…
అయితే 2018లో సౌదీలోని ఖతార్‌లో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌తోనే ఈ స్మగ్లింగ్‌కు పునాది పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రైల్వే స్క్వాడ్‌ విధులతో పాటు అథ్లెటిక్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జాయింట్‌ సెక్రటరీగా పని చేస్తున్న ఆకుల వెంకట రాఘవేంద్రరావు ఆ గేమ్స్‌కు ఇండియన్‌ టీమ్‌ మేనేజర్‌గా వెళ్లారు.  అప్పట్లోనే అక్కడున్న కొందరు స్మగ్లర్‌లతో పరిచయాలు పెంచుకుని బంగారం బిస్కెట్‌ల అక్ర మ వ్యాపారాన్ని నగరంలో విస్తరించారని నగరంలోని పలు క్రీడా వర్గాలు చెప్పుకుంటున్నాయి. రాఘవేంద్రరావు గతంలో అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న విషయం క్రీడా సంఘాల నాయకుల మధ్య ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వీరికి డబ్బులు చెల్లించిన  వారిలో ఎక్కువ మంది రైల్వే శాఖ ఉద్యోగులైన టీసీలు, విజయవాడ దుర్గ గుడిలో పని చేస్తున్న సిబ్బందే  ఎక్కవ మంది ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా బాధితులు రూ.6 కోట్ల రూపాయలు ఈ ముఠాకు చెల్లించినట్లు సమాచారం. డబ్బు చెల్లించిన ఇద్దరు టీసీలు నాగమణిని నిలదీయటంతో ఆమె కిడ్నాప్ కేసు పెట్టింది. దీంతో వ్యవహారం బయటపడింది.

కాగా బంగారం బిస్కట్లకు చెల్లించిన వారిలో ఎక్కువ మంది నల్లధనాన్ని చెల్లించటంతో ఫిర్యాదు చేయటానికి ఎవరూ ముందుకు రావటం లేదని సమాచారం. కాగా… ఈనెల 4న ఈవ్యవహారంపై మీడియాలో వార్తలురావటంతో పలువురు బాధితులు ఫోన్ చేసి ఇప్పుడిప్పుడే వివరాలు చెబుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు.