Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ కోసం టెక్నాలజీ వాడుతున్న బెజవాడ పోలీసులు

చెడ్డీ గ్యాంగ్ కోసం బెజవాడ పోలీసులు ఫాల్కన్ పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టారు. శివారు ప్రాంతాలను కెమెరాలతో పోలీసులు జల్లెడపడుతున్నారు. కీలక ప్రదేశాలైన విజయవాడ రైల్వే స్టేషన్ వెనుక, బుడమేరు, చిట్టినగర్ వంటి ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ కోసం టెక్నాలజీ వాడుతున్న బెజవాడ పోలీసులు

Ap Police

Updated On : December 15, 2021 / 9:43 AM IST

Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ కోసం బెజవాడ పోలీసులు ఫాల్కన్ పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టారు. శివారు ప్రాంతాలను కెమెరాలతో పోలీసులు జల్లెడపడుతున్నారు. కీలక ప్రదేశాలైన విజయవాడ రైల్వే స్టేషన్ వెనుక, బుడమేరు, చిట్టినగర్ వంటి ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.

విజయవాడ పోలీసులు దొంగలను గుర్తించేందుకు టెక్నాలజీ సాయంతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫాల్కన్ వెహికల్ లో 360 డిగ్రీల్లో 16 కెమెరాలను ఒకేసారి చూపిస్తున్నారు.

కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో ఉన్న వస్తువులు, వ్యక్తుల కదలికలను స్పష్టంగా చూపిస్తున్నాయి. నేరచరిత్ర ఉన్నవారిని టెక్నాలజీ సాయంతో వేగంగా గుర్తించే సదుపాయం ఉంది. ఈ ఫాల్కన్ వెహికల్ కు.. డ్రోన్ కెమెరాలు సైతం అనుసంధానం చేస్తున్నారు.

Leena Nair: మరో విదేశీ సంస్థకు ఇండియన్ సీఈఓ.. లీనా నాయర్