Visakha : గర్భిణీని కోసం వచ్చిన అంబులెన్స్‌ను అడ్డుకున్న గ్రామస్థులు

Visakha : గర్భిణీని కోసం వచ్చిన అంబులెన్స్‌ను అడ్డుకున్న గ్రామస్థులు

Vishaka corona

Blocked The Ambulance : కరోనా మానవత్వాన్ని చంపేస్తోంది. సొంతవాళ్లు అని తెలిసినా..భయంతో వారిని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. కరోనా సోకిందంటూ..నడి రోడ్డుపైనే వారిని వదిలేస్తున్న ఘటనలు అందర్నీ కలిచివేస్తున్నాయి. కరోనా భయంతో గ్రామాల్లో కొందరు విచక్షణ కోల్పోతున్నారు. తాజాగా…ఓ గర్భిణీని తీసుకెళ్లేందుకు వచ్చిన అంబులెన్స్‌ను అడ్డుకున్నారు గ్రామస్థులు. ఈ ఘటన విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం పాలమామిడి గ్రామంలో చోటు చేసుకుంది.

గ్రామంలో ఓ గర్భిణీకి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గ్రామ శివారు ప్రాంతం వద్దకు రాగానే..అక్కడున్న గ్రామస్తులు అంబులెన్స్ గర్భిణీ నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లనివ్వలేదు. కరోనా భయంతో అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

వారు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఏమీ చేసేది ఏమీ లేక…కుటుంబసభ్యులే..కాలినడకన..ఆమెను అంబులెన్స్ వద్దకు తీసుకొచ్చారు. ఆసుపత్రికి తీసుకెళుతున్నారు. కానీ..అప్పటికే ఆలస్యం అయిపోయింది. పురిటినొప్పులు ఎక్కువ కావడంతో..అంబులెన్స్‌లోనే ప్రసవించింది. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు.

Read More : SunRisers Hyderabad: ఇది సన్‌రైజర్స్ వంతు.. కొవిడ్‌పై పోరాటానికి రూ.30కోట్ల విరాళం