SunRisers Hyderabad: ఇది సన్‌రైజర్స్ వంతు.. కొవిడ్‌పై పోరాటానికి రూ.30కోట్ల విరాళం

సన్‌రైజర్స్ హైదరాబాద్ కొవిడ్ పై పోరాటంలో భాగంగా విరాళాన్ని ప్రకటించింది. ఇప్పటికే రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యాలు ఆర్థిక సాయంతో పాటు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, మెడికల్‌ కిట్లను..

SunRisers Hyderabad: ఇది సన్‌రైజర్స్ వంతు.. కొవిడ్‌పై పోరాటానికి రూ.30కోట్ల విరాళం

Sunrisers Hyderabad

Updated On : May 10, 2021 / 7:28 PM IST

SunRisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొవిడ్ పై పోరాటంలో భాగంగా విరాళాన్ని ప్రకటించింది. ఇప్పటికే రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యాలు ఆర్థిక సాయంతో పాటు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, మెడికల్‌ కిట్లను డొనేట్‌ చేశాయి.

రీసెంట్‌గా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విరాళాన్ని ప్రకటించింది. కొవిడ్‌-19 మహమ్మారి సెకండ్‌ వేవ్‌తో ఇబ్బందిపడుతున్న వారిని ఆదుకునేందుకు సన్‌టీవీ(సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌) రూ.30కోట్లు విరాళంగా ఇస్తోందని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ తన అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది.

స్వచ్ఛంద సంస్థలతో పాటు కేంద్ర, రాష్ఱ ప్రభుత్వాలు చేపడుతున్న కొవిడ్‌-19 సహాయక చర్యలకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు అందులో రాసుకొచ్చింది. ఆక్సిజన్ సిలిండర్లు, మెడిసిన్లు సప్లై చేస్తున్న ఎన్జీఓలతో భాగమయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.