ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ….వైజాగ్ ప్రజల సంతోషం

  • Published By: bheemraj ,Published On : July 31, 2020 / 07:53 PM IST
ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖ….వైజాగ్ ప్రజల సంతోషం

రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఏపీకి ఇకనుంచి మూడు రాజధానులు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని నిర్ణయించడం పట్ల వైజాగ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ రద్దు బిల్లుతో పాటుగా రాజధాని వికేంద్రీకరణ బిల్లును కూడా ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో సంవత్సరకాలంగా విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అవుతుందని ఇక్కడి ప్రజలు ఎంతో ఎదురుచూస్తున్నారు.

అన్ని విధాలుగా విశాఖ అభివృద్ధి చెందింది. ఈనేపథ్యంలోనే ఇక్కడ రాజధాని వస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరంతోపాటుగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావించింది. దీనికి సబంధించి విలువైన భూముల లభ్యత, అధికారులు ఉండటానికి కావాల్సిన అన్ని సదుపాయాలు విశాఖ నగరంలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగంలోని
పెద్దలు కూడా కొంతమంది రావడం విశాఖలో ఉన్న లభ్యత గురించి కానీ సచివాలయం పూర్తిగా రానుంది.

60 వేల కుటుంబాలు అంటే సచివాలయం, సచివాలయ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఇతరులు కలుపుకుని మొత్తం 60 వేల ప్రజలు ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో అసలు వచ్చే వారికంతా ఇక్కడ పొటెన్షియాలిటీ ఉందా? అనే అంశాలకు సబందించి పూర్తిగా ఇప్పటికే ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళిక వేసిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ప్రధానంగా విశాఖలోని కొన్ని ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది.

ప్రధానంగా భీమిలి, ఆనందపురం అలాగే బోగాపురం వరకు ఉన్న ప్రాంతాలను కూడా రాజధానిగా చెయ్యొచ్చని చెప్పొచ్చు. అక్కడ సచివాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉండే అవకాశాలు ఉంది అని చెప్పేసెసి దీనికి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇంతకుముందే గవర్నర్ ఆమోదం ముద్ర వేయడం జరిగింది కాబట్టి ప్రధానంగా ఇక్కడి ప్రజలు మాత్రం విశాఖ రాజధానిగా చెయ్యాలనే కోరుకుంటున్నారు.

ప్రధానంగా ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, సచివాలయ విభాగాలు కానీ ఉండే ప్రాంతంకి సంబంధించి ఇప్పటికే నోటిఫై చేశారా? దానికి సంబంధించిన వివరాలేంటి? ఇక పాలనా రాజధానిగా ఉండటానికి అడ్డంకులు తొలగిపోయాయి కాబట్టి ఏ ఏ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహంట్స్ కార్యాలయం ప్రధానంగా హైదరాబాద్ కేంద్రీకృతంగా పని చేశారు. అయితే కొద్ది రోజుల క్రితమే దాదాపు నెలరోజుల క్రితమే ఒక డీజీపీ గౌతం సవాంగ్ విశాఖలో పర్యటించడం జరిగింది.

విశాఖలోని ప్రధానంగా ఆనందపురం తదితర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా గ్రేహంట్స్ కోసం ప్రత్యేకంగా దాదాపు 250 ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఇంతే కాకుండా ప్రభుత్వం ఉన్నతాధికారులు చాలామంది చీఫ్ సెకట్రేటరీస్ అనేక శాఖలకు సంబంధించి ఉన్నతాధికారులు ఇప్పటికే విశాఖ నగరంలో పర్యటించడం జరిగింది. ప్రధానంగా భూములు లభ్యత లేనప్పటికీ విశాఖ శివారులో ఉన్న భీమిలి, ఆనందపురం అలాగే పెందుర్తి తదితర ప్రాంతాల్లో ఎంతో భూవనరులు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా భీమిలి అలాగే ఆనందపురం దగ్గర సచివాలయం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వైసీపీ వర్గాలు, అటు ప్రభుత్వ వర్గాలు చెప్పడం అనేది జరుగుతుంది.

అంతేకాకుండా ఇంకాస్త ట్రాన్స్ పోర్ట్ అయ్యేసి ఇప్పటికే అనకాపల్లి నుంచి బోగపురం వరకు ఆరు లైన్ల హైవే కూడా అభివృద్ధి జరుగుతుంది. ఒక వేళ విశాఖకు మెట్రో రైళ్ల శాక్షన్ ఇప్పటికే కావడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒకలా బోగాపురం దగ్గరలో వచ్చినప్పటికీ విశాఖ ఆనందపురం దగ్గర నుంచి బోగాపురం దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. పరిపాలన రాజధానిగా విశాఖ కన్ ఫామ్ అయిన నేపథ్యంలో వచ్చే ప్రజానీకానికి భీమిలి, ఆనందపురం, భోగాపురం ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది.