Viveka murder case: వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులకు భద్రత పెంపు

సాక్షుల భద్రతపై సీబీఐ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ వారికి భదత్ర కల్పించాలని కోర్టును కోరారు

Viveka murder case: వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులకు భద్రత పెంపు

Cbi

Viveka murder case: మాజీ మంత్రి, దివంగత నేత వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులకు భద్రత పెంచుతూ కడప కోర్టు ఆదేశాలు జారీచేసింది. వివేకానంద రెడ్డి ఇంటి వాచ్ మ్యాన్ గా పనిచేసిన రంగయ్యకు గన్ మెన్ తో కూడిన వన్ ప్లస్ వన్ భద్రత కల్పించాలని, వివేకా వద్ద పనిచేసిన మాజీ డ్రైవర్ దస్తగిరికి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. గత మూడు నెలలుగా వీరిరువురికీ పోలీసు భద్రత కల్పించినప్పటికీ సోమవారం నుండి గన్ మెన్లతో కూడిన భద్రత కల్పించనున్నారు పోలీసులు. వివేకా హత్య కేసులో దోషులతో పాటు సాక్షులకు ప్రాణహాని ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. అదే సమయంలో సాక్షుల భద్రతపై సీబీఐ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ వారికి భదత్ర కల్పించాలని కోర్టును కోరారు. దీనిపై నాలుగు రోజుల క్రితం విచారణ జరిపిన కడప కోర్టు.. సాక్షుల భద్రతపై స్థానిక పోలీసులను ప్రశ్నించింది.

Also read:YSRCP MPs On Development : సింగపూర్‌లా ఏపీ రాజధాని కట్టాలంటే రూ.2లక్షల కోట్లు కావాలి- వైసీపీ ఎంపీలు

అయితే గత మూడు నెలల నుంచి సాక్షులకు భద్రత కల్పించామని పోలీసులు కోర్టుకు వివరించారు. అయితే సాయుధ దళాలతో కూడిన భద్రత ఇవ్వాలంటూ నేడు కోర్టు ఆదేశించింది. రంగయ్య , దస్తగిరికి గన్ మెన్ల సౌకర్యం కల్పించండంతో పాటు పర్యవేక్షణకు ఒక ఎస్సై స్థాయి అధికారిని నియమించాలంటూ కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే..తన తండ్రి వివేకా హత్యకేసులో శివశంకర్ రెడ్డి బెయిలు పిటిషన్ పై సోమవారం సునీతా రెడ్డి అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తనను ఈ కేసులో ఇంప్లీడ్ చేయాలనీ కోరుతూ సునీతా రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏ నిబంధనల ప్రకారం ఇంప్లీడ్ చేయాలనీ కోర్టు సునీతా రెడ్డిని ప్రశ్నించగా..అన్ని వివరాలు త్వరలో కోర్టుకు సమర్పిస్తానని సునీతారెడ్డి కోర్టుకు తెలిపారు.

Also read:Nara Lokesh : కొత్త డిమాండ్లు పెట్టడం లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేయండి