Corona Test: మాకు కరోనా లేదు… పరీక్షలు చేయొద్దు

కరోనా పరీక్షల కోసం ప్రజలు ఆసుపత్రులు, ల్యాబ్ ల ముందు బారులురు తీరుతున్నారు. ఎండని లెక్కచేయకుండా కరోనా పరీక్షల కోసం వస్తున్నారు. అయితే ఏజెన్సీ ఏరియాల్లో మాత్రం గిరిజనులు పరీక్షలు చేయించుకోవడానికి ముందు రావడం లేదు.

Corona Test: మాకు కరోనా లేదు… పరీక్షలు చేయొద్దు

Corona Test

Corona Test: కరోనా పరీక్షల కోసం ప్రజలు ఆసుపత్రులు, ల్యాబ్ ల ముందు బారులురు తీరుతున్నారు. ఎండని లెక్కచేయకుండా కరోనా పరీక్షల కోసం వస్తున్నారు. అయితే ఏజెన్సీ ఏరియాల్లో మాత్రం గిరిజనులు పరీక్షలు చేయించుకోవడానికి ముందు రావడం లేదు. విశాఖ జిల్లా అరకు మండలంలో వైద్య సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి పరీక్షలు చేస్తున్నారు.

అయితే మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు టెస్టులకు సహకరిస్తుండగా మరికొన్ని గిరిజనల గూడెల ప్రజలు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. కిముడుపల్లి అనే గిరిజన గూడెంలో 550 మంది నివసిస్తున్నారు. వీరిలో 40 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ గ్రామంలో ఇప్పటికే ఏడుగురు కరోనా పేషెంట్లు ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

మంగళవారం ఆరుగురికి బలవంగంగా పరీక్షలు చేస్తే వారిలో ముగ్గురికి కరోనా నిర్దారణ అయినట్లు వైద్యులు చెబుతున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేస్తామంటే ఆ గూడెం ప్రజలు ఒప్పుకోవడం లేదు..తమకు కరోనా లేదని వైద్య సిబ్బందితోనే వాగ్వాదానికి దిగుతున్నారు

మంగళవారం పరీక్షలకు వెళ్లిన అధికారులకు గూడెం ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురుకోవడంతో వెనుదిరిగారు. ఇక సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు వైద్య సిబ్బంది.