సీఎం జగన్ కు హ్యాట్సాఫ్ చెప్పిన పూరీ జగన్నాథ్..ఎందుకో తెలుసా

  • Published By: madhu ,Published On : July 2, 2020 / 12:19 PM IST
సీఎం జగన్ కు హ్యాట్సాఫ్ చెప్పిన పూరీ జగన్నాథ్..ఎందుకో తెలుసా

ఏపీ సీఎం జగన్…కు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ హ్యాట్సాఫ్ చెప్పారు. ప్రశంసలు కురిపించారు. Doctors Day సందర్భంగా…రాష్ట్రంలో భారీ స్థాయిలో 108, 104 సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై పూరి జగన్నాథ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా చేసిన ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అంబులెన్స్ ల సముదాయాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్ కు అభినందనలు అంటూ పూరి ట్వీట్ చేశారు.

భారతదేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అందరూ పోరాడుతున్న సమయంలో అత్యవసర పరిస్థితి కోసం అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. అత్యవసర పరిస్థితులు, ప్రమాదాల, విపత్తులు తీవ్రమైన అమరికల కోసం వీటిని ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు.

అధికారం చేపట్టిన రోజు నుంచి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం జగన్ ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు చేపట్టి, అమలు చేస్తున్న సీఎం జగన్, ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేశారు.

అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వసతులతో 108, 104 సర్వీసుల్లో సమూలు మార్పులు చేసి వాటిని తీర్చిదిద్దారు. 2020, జూలై 1వ తేదీన ఉదయం 9.30 గంటలకు విజయవాడ బెంజి సర్కిల్‌ దగ్గర అత్యాధునిక అంబులెన్స్‌ సర్వీసులను సీఎం జగన్ ప్రారంభించారు. జెండా ఊపి మొత్తం 1,088 అంబులెన్స్ వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ అంబులెన్సు వాహనాలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు తరలించారు. ఇందులో 676 కొత్త 104 వాహనాలు, 412 కొత్త 108 వాహనాలు ఉన్నాయి.

Read:Oscar academyలో హృతిక్ రోషన్, అలియా భట్