రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు నలుగురు గెలుపు

  • Published By: murthy ,Published On : June 19, 2020 / 01:00 PM IST
రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు నలుగురు గెలుపు

ఈరోజు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు వైసీపీ అభ్యర్దులు విజయం సాధించారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో 173 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే  వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి  నలుగురు అభ్యర్ధులకు ఓట్లు వేసేట్లుగా  పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవటం జరిగింది.  టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు  వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిలు చెల్లనిఓట్లు వేయగా…టీడీపీ కి చెందిన మరో ఎమ్మెల్యేఆదిరెడ్డి భవాని  వేసిన ఓటు పొరపాటున నెంబరు వేయకుండా రైట్ మార్కు నోట్ చేయటంతో ఆ ఓటు కూడా చెల్లకుండా పోయింది.

మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావటంతో టీడీపీ కి 17 ఓట్లు మాత్రమే వచ్చాయి.  జనసేన ఎమ్మెల్యే  రాపాక కూడా  వైసీపీకి  ఓటు వేయటంతో వైసీపీ సభ్యుల ఎన్నిక తేలిక అయ్యింది. టీడీపీ  వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని తెలుస్తోంది. దీంతో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వాని ఎంపికయ్యారు. వీరిని సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.