YS Viveka : అలా చంపేశాం.. రూ.40కోట్లు సుపారీ.. వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా కారు డ్రైవర్ షేక్ దస్తగిరి ఆగస్టు 31న ప్రొద్దూటూరు కోర్టులో జడ్జి ముందు అప్రూవర్‌గా మారి వాంగ్

YS Viveka : అలా చంపేశాం.. రూ.40కోట్లు సుపారీ.. వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు

Ys Viveka

YS Viveka : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా కారు డ్రైవర్ షేక్ దస్తగిరి ఆగస్టు 31న ప్రొద్దూటూరు కోర్టులో జడ్జి ముందు అప్రూవర్‌గా మారి వాంగ్మూలం ఇచ్చాడు. వాంగ్మూలంలో వైఎస్ వివేకా హత్య వెనుక కారణాలు వెల్లడించాడు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారు? ఎలా హత్య చేశారు? ఎందుకు చంపేశారు? అనేది వివరించాడు. బెంగళూరు ల్యాండ్‌ వివాదంలో వాటా ఇవ్వలేదని వివేకా హత్యకు గంగిరెడ్డి ప్లాన్‌ చేశాడని దస్తగిరి ఒప్పుకున్నాడు.

World Diabetes Day 2021 : ప్రతి షుగర్ పేషెంట్ తప్పక తినాల్సిన 5 పండ్లు ఇవే..!

ఆగస్టు 31న వైఎస్ వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. దస్తగిరి తన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో బడా నేతల పేర్లు ప్రస్తావించారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. వివేకా హత్యలో తనతో పాటు నలుగురు పాల్గొన్నట్టు దస్తగిరి అంగీకరించాడు.

ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి ఒప్పకున్నాడు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు చెప్పాడు. బెంగళూరులో భూముల లావాదేవీలకు సంబంధించి వాటా ఇవ్వకపోవడంపై వివేకాపై ఎర్ర గంగిరెడ్డి ఆగ్రహం పెంచుకున్నట్లు తెలిపాడు.

Urinate : మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళుతున్నారా?..కారణాలు తెలుసా?..

”ఎర్ర గంగిరెడ్డి, సునీల్, ఉమా శంకర్, నేను వివేకా ఇంటికి వెళ్లాం. బెంగళూరు స్థలంలో వివేకాను ఎర్ర గంగిరెడ్డి వాటా అడిగాడు. అప్పుడే సునీల్ వివేకా ముఖంపై గట్టిగా కొట్టగా వివేకా పడిపోయాడు. ఉమాశంకర్ రెడ్డి గొడ్డలితో వివేకా ఛాతీపై 8సార్లు నరికాడు. గొడ్డలితో దాడి చేసి వివేకాతో లేఖ రాయించాం. బాత్రూమ్ లోకి తీసుకెళ్లి వివేకాను హత్య చేశారు. ఆ తర్వాత సునీల్, ఉమా శంకర్ కొన్ని పత్రాలు తెచ్చారు. ఆ తర్వాత అందరం గోడ దూకి పారిపోయాం. భయపడొద్దని.. అవినాష్, శంకర్ రెడ్డి చూసుకుంటారని గంగిరెడ్డి చెప్పాడు. మొత్తం హత్యకు రూ.40 కోట్లు సుపారీ. నా వాటా కింద రూ. కోటి ఇచ్చారు” అని దస్తగిరి చెప్పాడు.

”సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర కుక్కను కారుతో తొక్కించి చంపేశారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలతో కలిసి నేను వివేకా ఇంటి కాంపౌండ్ దూకి లోపలికి వెళ్లాను. అప్పటికే ఇంట్లో ఉన్న గంగిరెడ్డి తలుపు తీయడంతో వెళ్లాను. మమ్మల్ని చూసి ఈ సమయంలో వీళ్లెందుకు వచ్చారని వివేకా నిర్ఘాంతపోయారు. తర్వాత బెడ్ రూమ్ లోకి వెళ్లారు. ఆయన వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడు. వివేకా బెడ్ రూమ్ లో డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగింది. వివేకాను బూతులు తిడుతూ ముఖంపై సునీల్ యాదవ్ దాడి చేశాడు. నా చేతిలోని గొడ్డలితో సునీల్ యాదవ్ వివేకాపై దాడి చేశాడు. వెంటనే వివేకా కింద పడిపోవడంతో ఆయన ఛాతీపై 7, 8 సార్లు సునీల్ యాదవ్ బలంగా కొట్టాడు. వివేకాపై గొడ్డలితో దాడి చేసి ఆయన చేత్తో లేఖ రాయించాం. సునీల్ యాదవ్, ఉమాశంకర్ ఇంట్లోని కొన్ని పత్రాలు తీసుకున్నారు. వివేకాను హత్య చేశాక అందరం గోడ దూకి పారిపోయాం. భయపడేది లేదు అవినాష్, శంకర్‌ రెడ్డి అంతా చూసుకుంటారని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడు” అని దస్తగిరి చెప్పాడు.