YSRCP : వార్ వన్‌సైడ్.. నెల్లూరులో వైసీపీ క్లీన్‌స్వీప్.. 54 డివిజన్లలోనూ ఫ్యాన్ గాలి

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 54 డివిజన్లకు గాను 54 గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్ష టీడీపీ ఒక్క డివిజన్ లోనూ గెలవలేకపోయింది.

YSRCP : వార్ వన్‌సైడ్.. నెల్లూరులో వైసీపీ క్లీన్‌స్వీప్.. 54 డివిజన్లలోనూ ఫ్యాన్ గాలి

Ysrcp

YSRCP : నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 54 డివిజన్లకు గాను 54 గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్ష టీడీపీ ఒక్క డివిజన్ లోనూ గెలవలేకపోయింది. మొత్తం 54 డివిజన్లకు గాను 8 ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పుడు ఎన్నిక జరిగిన 46 డివిజన్లను ఫ్యాన్ పార్టీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవాలతో కలిపి కార్పొరేషన్‌లో ఉన్న మొత్తం 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. క్లీన్ స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించింది. అటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ లో 4 డివిజన్లకు ఉపఎన్నిక జరగ్గా అన్నీ వైసీపీకే దక్కాయి.

Accident : ఘోరం… ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కారణాలతో నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మున్సిపాలిటీల కౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఇందులో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 9 మున్సిపాలిటీలను అధికార పార్టీ వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీ సహా ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో వైసీపీ విజయ ఢంకా మోగించింది. ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రం టీడీపీ గెలుపొందింది.

సోమవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభమైంది. పెండింగ్ లో ఉన్న మున్సిపాల్టీలకు ఈ నెల 15న పోలింగ్ జరిగింది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ప్రచారం చేశాయి. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు, మరో 10 మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి.

Read More..Pollution : ఫైవ్ స్టార్ హోటల్స్‌‌లో ఉంటూ రైతులపై విమర్శలా ? కాలుష్యంపై జస్టిస్ ఎన్వీ రమణ సీరియస్

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీ మొదటి నుంచి హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ తిరిగి తమ పట్టు నిలపుకోవాలని తెలుగుదేశం పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఇది చంద్రబాబు కంచు కోట కావడంతో.. ఇక్కడ గెలిచి సత్తా చాటాలని వైసీపీ వ్యుహం పన్నింది. ఈ పోటాపోటీ వాతావరణంలో.. కుప్పం ఫలితం అధికార పార్టీ వైసీపీనే వరించింది.

మునిసిపాలిటీల్లో 325 డివిజన్లు, వార్డులకు సోమవారం ఎన్నికలు జరిగాయి. 325 స్థానాలకు 1,206 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. పోలింగ్‌లో 8,62,066 మందికిగాను 5,14,086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.