YV Subbareddy : చిరుత దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న చిన్నారి.. పరామర్శించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

మరో రెండు మూడు రోజులు బాలుడిని ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తామని చెప్పారు. పూర్తిగా కోరుకున్నాక చిన్నారితో సహా కుటుంబ సభ్యులందరికీ దగ్గరుండి స్వామి దర్శన ఏర్పాట్లు చేయించి పంపుతామని వెల్లడించారు.

YV Subbareddy : చిరుత దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న చిన్నారి.. పరామర్శించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy

YV Subbareddy Visit Child : తిరుపతిలో చిన్నారిపై చిరుత పులి దాడి చేసి, ఎత్తుకెళ్లే యత్నం చేసిన విషయం తెలిసిందే. చిరుత దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి కౌశిక్ ను శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బాలుడికి ప్రాణాపాయం లేదన్నారు. ఎలాంటి ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు.

ఆ స్వామివారి దయవల్లే చిరుత దాడి నుంచి బాబు ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. మరో రెండు మూడు రోజులు బాలుడిని ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తామని చెప్పారు. పూర్తిగా కోరుకున్నాక చిన్నారితో సహా కుటుంబ సభ్యులందరికీ దగ్గరుండి స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేయించి పంపుతామని వెల్లడించారు.

Tirumala : తిరుమలలో చిరుత కలకలం.. ఐదేళ్ల బాలుడిని ఎత్తుకెళ్లే ప్రయత్నం

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యామ్నాయ చర్యల తీసుకోవడం గురించి యోచిస్తున్నామని తెలిపారు. నడకదారికి ఇరువైపులా పూర్తిస్థాయిలో కంచెను నిర్మించడం లేదా సాయంత్రం 6 తర్వాత నడకదారిని బంద్ చేయడంపై ఆలోచిస్తామని చెప్పారు. ఈ రెండు అంశాల అమలులో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.