Home » Author »Narender Thiru
కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతోపాటు, ఇతర మార్గాల్లో ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇటీవల తెలంగాణ విద్యాశాఖ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడి వ్యవహారంపై విజిలెన్స్ శాఖ వ�
ఈ పిండాలు అన్నీ ఐదు నుంచి ఏడు నెలల వయసు ఉన్నవి కావడం గమనార్హం. లింగ నిర్ధరణ పరీక్షలు జరిపి, ఆ పిండాలను తొలగించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని పిండాలను స్వాధీనం చేసుకున్నారు.
1.3 కిలోమీటర్ల పొడవైన గోడపై అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు, ఆరు రుతువులను చూపే చిత్రాలు, రాశులు, వివిధ జంతుజాలం, భారతీయ సంస్కృతి, పండుగలు వంటివి ఆ చిత్రాల్లో కనిపిస్తాయి.
ఇంకా 2.8 లక్షల మంది వరద ముంపులోనే చిక్కుకున్నారు. 1,395 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, వరద బాధితులకు ఆశ్రయం కల్పిస్తోంది. అసోంలో 35 జిల్లాలు ఉంటే, 30 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి.
విద్య, వైద్యం, నైపుణ్యాల పెంపు వంటి అంశాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు. తన తండ్రి శాంతిలాల్ అదానీ శత జయంతి సందర్భంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమ్ అదానీ చెప్పారు.
గుప్తా నియామకానికి సంబంధించి కేంద్ర హోం వ్యవహారాల శాఖ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. దినకర్ గుప్తా.. మార్చి 31, 2024 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
ప్రభుత్వంలో సొంత పార్టీ నేతలకంటే ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలకే ప్రాధాన్యం దక్కిందని శివసేన ఎమ్మెల్యేలు ఆరోపిస్తుంటే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎన్సీపీపై ఆరోపణలు చేసింది.
ఈ సోషల్ ఫీచర్ ఇప్పటివరకు స్పోటిఫై డెస్క్‌టాప్ వెర్షన్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్, ఐ ఫోన్లపై కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
మహారాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం కావాలి. ఉద్ధవ్‌తోపాటు అందరికీ న్యాయం కావాలి. ఈ రోజు మీరు (బీజేపీ) అధికారంలో ఉండి డబ్బు, కండ బలం, మాఫియా శక్తుల్ని ఉపయోగిస్తున్నారు.
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజాగా శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేశారు.
బిహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హరియాణా వంటి అనేక రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. రైళ్లు నడవకపోవడం వల్ల టిక్కెట్లు కూడా వెనక్కివ్వాల్సి వచ్చింది. దీనివల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోయింది.
మీ సంస్థలో అగ్నివీర్లకు ఎలాంటి ఉద్యోగం ఇస్తారు? నేను తాజ్ ఘటనలో అదానీ సహా 185 మందిని కాపాడాను. అయినా, ఇప్పటికీ ఉపాధి లేకుండా ఉన్నాను. నాలాగే చాలా మంది పదిహేనేళ్లుగా ఉపాధి అవకాశాలు లేకుండానే ఉన్నారు.
పేదలు ఇండ్లు కట్టుకుని ధైర్యంగా నిలబడ్డారంటే పీజేఆర్ వల్లే. ఆయనను నమ్ముకుని ఇతర రాష్ట్రాల వారు లక్షలాది మంది హైదరాబాద్ వచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సొంత పార్టీనే నిలదీసిన నేత ఆయన.
ఖైరతబాద్ నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ రుణ పడి ఉంటా. నేను పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు నన్ను బాధించాయి. షీ టీములు పెట్టామని గొప్పగా చెప్పుకున్నా
బుధవారం సాయంత్రం ఉద్ధవ్ థాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే తిరుగుబాటు నేత షిండేను సీఎం చేయడం ఒక్కటే మార్గమని ఉద్ధవ్‌కు సూచించినట్లు సమాచారం.
గత రెండేళ్లలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ద్వారా శివ సైనికులు, పార్టీ బలహీన పడ్డాయి. ఇతర భాగస్వాములు మాత్రం లాభపడ్డారు. దీంతో శివ సైనికులు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శివసేన అసహజమైన ఈ కూటమి నుంచి బయటకు రావాలి.
బ్యాంకు మోసాలకు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు నమోదు చేసిన అతిపెద్ద మోసపు కేసు ఇదే. ఇంతకుముందు సీబీఐ నమోదు చేసిన అత్యంత విలువ కలిగిన బ్యాంకు కేసు ఏబీజీ షిప్‌యార్డుకు సంబంధించింది. రూ.22,842 కోట్ల మోసం గురించి ఈ కేసు నమోదైంది.
దాదాపు నలభై రోజులుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేతకి జైలు నుంచి విడుదల కానుంది. కేతకి గత నెలలో శరద్ పవార్ గురించి ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చేసింది. దీంతో ఆమెపై థానే, పింప్రి, పుణేల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాయి.
ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక వివాహ మహోత్సవంలో ఒక్కటయ్యే వధూవరులకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, పెండ్లి వస్త్రాలు అందజేస్తామన్నారు. వధూవరుల తరఫున వచ్చే 40 మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు
వర్షాకాలం పంట పెట్టుబడి కింద రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.