TTD: ఆగష్టు 7న జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణమస్తు

ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక వివాహ మహోత్సవంలో ఒక్కటయ్యే వధూవరులకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, పెండ్లి వస్త్రాలు అందజేస్తామన్నారు. వధూవరుల తరఫున వచ్చే 40 మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

TTD: ఆగష్టు 7న జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణమస్తు

Ttd

TTD: ఆగష్టు 7న ఏపీలోని 26 జిల్లా కేంద్రాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆగష్టు 7న ఉదయం 08:07 గంటల నుంచి 08:17 గంటల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో కల్యాణమస్తు కేంద్రీకృత కార్యాలయాన్ని బుధవారం ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్యాణమస్తు దరఖాస్తు పత్రం, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక వివాహ మహోత్సవంలో ఒక్కటయ్యే వధూవరులకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, పెండ్లి వస్త్రాలు అందజేస్తామన్నారు.

Uddhav Thackeray: అవసరమైతే రాజీనామాకు సిద్దం: ఉద్ధవ్ థాక్రే

వధూవరుల తరఫున వచ్చే 40 మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవసరమైన వారు స్వామి వారి ఆశీస్సులతో ఉచితంగా వివాహం జరిపించుకోవచ్చని సూచించారు. జూలై 1 నుంచి 20వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో, టీటీడీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక కో ఆర్డినేటర్‌ను నియమిస్తున్నట్లు వివరించారు.