Uddhav Thackeray: ఉద్ధవ్‌కు కోవిడ్ నెగెటివ్.. అధికార నివాసాన్ని వీడనున్న సీఎం

బుధవారం సాయంత్రం ఉద్ధవ్ థాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే తిరుగుబాటు నేత షిండేను సీఎం చేయడం ఒక్కటే మార్గమని ఉద్ధవ్‌కు సూచించినట్లు సమాచారం.

Uddhav Thackeray: ఉద్ధవ్‌కు కోవిడ్ నెగెటివ్.. అధికార నివాసాన్ని వీడనున్న సీఎం

Uddhav Thackeray (2)

Updated On : June 22, 2022 / 9:43 PM IST

Uddhav Thackeray: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు కోవిడ్ నెగెటివ్‌గా తేలింది. బుధవారం ఉదయం ఉద్ధవ్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ప్రకటించారు. అయితే, ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్లు తాజాగా వెల్లడించారు. మరోవైపు బుధవారం సాయంత్రం ఉద్ధవ్ థాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే తిరుగుబాటు నేత షిండేను సీఎం చేయడం ఒక్కటే మార్గమని ఉద్ధవ్‌కు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్ధవ్‌ థాక్రే త్వరలోనే తన అధికార నివాసమైన ‘వర్ష’ను వీడబోతున్నారు.

MVA Crisis: కూటమి నుంచి శివసేన బయటకు రావాలి: ఏక్‌నాథ్ షిండే

తన నివాసాన్ని శాశ్వత నివాసమైన మాతోశ్రీకి మార్చబోతున్నారు. దీంతో త్వరలో తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదని ఉద్ధవ్‌ సోషల్ మీడియా లైవ్ ద్వారా వెల్లడించారు. ఎమ్మెల్యేలు కోరితే సీఎం పదవిని వీడుతానని ప్రకటించారు.